Advertisement
Google Ads BL

భర్త ఫోటోలని డిలీట్ చేసిన హీరోయిన్..


ఆడవారి మాటలకి అర్థాలే వేరులే సినిమాలో ఒక చిన్న పాత్రచేసి, గుర్తింపు తెచ్చుకున్న స్వాతి ఆ తర్వాత అష్టాచమ్మా సినిమాతో హీరోయిన్ గా పరిచయమయింది. అష్టాచమ్మా తర్వాత ఆమె చాలా సినిమాల్లో  నటించింది. అయితే ఎన్ని సినిమాల్లో చేసినా స్వాతిగా కంటే కలర్స్ స్వాతిగానే గుర్తింపు దక్కింది. తెలుగుతో పాటు తమిళ, మళయాల చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన స్వాతికి సాధారణంగానే తెలుగులో ఎక్కువ అవకాశాలు రాలేదు.

Advertisement
CJ Advs

కార్తికేయ సినిమా చేశాక వికాస్ వాసుని పెళ్ళి చేసుకుని సినిమాలకి దూరంగా ఉంటుంది. పెళ్ళి తర్వాత ఆమె వార్తల్లో కనిపించలేదు. తాజాగా ఆమె వార్తల్లో కనిపించడానికి కారణం ఆమె చేసిన పనే. మామూలుగా సెలెబ్రిటీలు తమ సినిమా విషయాలతో పాటు పర్సనల్ విషయాలని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటారు. ఆ క్రమంలోనే వారికి సంబంధించిన ఫోటోలు కూడా పెడుతుంటారు.

అందరిలాగే స్వాతి కూడా తన పెళ్ళి ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టింది. అయితే ఏమైందో తెలియదు ఆ పెళ్లి ఫోటోలని సోషల్ మీడియా పేజి నుండి డిలీట్ చేసింది.తన భర్త ఫోటోలే కాదు, పెళ్ళి ఫోటోలు కూడా డిలీట్ చేయడంతో అందరికీ అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ మధ్య చాలా మంది తమ భర్తతో విడిపోవాల్సి వస్తే ముందు సోషల్ మీడియా ఫోటోలు డిలీట్ చేస్తున్నారు.

ఇలియానా, అమలాపాల్ ఇలానే చేశారు. అందుకే స్వాతి చేసిన చర్యపై అందరికీ అనుమానం కలిగింది. మరి వారి జీవితం సాఫీగానే సాగుతుందా, లేదా ఏదైనా తడబాటు వచ్చిందా అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

Swathi deleted her husband photos from Social media:

colours swathi deleted her husband pics from social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs