Advertisement
Google Ads BL

అనసూయ లవ్ స్టోరీ.. యమా ఇంట్రెస్టింగ్


అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం బుల్లితెర మీద హాట్ యాంకర్, వెండితెర మీద ప్రాధాన్యమున్న పాత్రలతో చెలరేగిపోతుంది. పెళ్లి చేసుకుంటే సక్సెస్ కాము అనుకున్నవాళ్ళకి అనసూయ భరద్వాజ్ కెరీర్ సక్సెస్ ఫుల్ స్టోరీ. అయితే అనసూయ పెళ్లి తర్వాతే కెరీర్ మొదలెట్టింది. పెళ్ళికి ముందు అనసూయ లవ్ స్టోరీ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్‌గా మారింది. అనసూయ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉండగా NCC క్యాంపు కి వెళ్లగా అక్కడికి భరద్వాజ్ గ్రూప్ కూడా వచ్చిందట. అనసూయని చూసి మనసు పారేసుకున్న భరద్వాజ్ అనసూయకి ప్రపోజ్ చెయ్యడమే కాదు పెళ్లి కూడా చేసుకుంటా అన్నాడట. కానీ పెళ్లి, ప్రేమ పై ఆలోచించే వయసు కాదని... అందుకే లైట్ తీసుకుందట. అయితే మళ్లీ నెక్స్ట్ ఇయర్ కూడా భరద్వాజ్ అలానే అడగగా.. భరద్వాజ్ మంచితనానికి అనసూయ కూడా పడిపోయింది.

Advertisement
CJ Advs

అయితే ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు రోజుకొకటి తెస్తుంటే.. అనసూయ ఒకరోజు భరద్వాజ్ ప్రేమ గురించి చెప్పగా.. అనసూయ తండ్రి అనసూయతో గొడవపడి మరీ భరద్వాజ్ ప్రేమను అంగీకరించలేదట. దానితో తండ్రితో గొడవ పడిన అనసూయ.. భరద్వాజ్ కోసమే బయటికి వచ్చేసి హాస్టల్‌లో ఉందట. ఆతర్వాత మళ్లీ ఇంటికి వెళ్లినా భరద్వాజ్ తో అనసూయ పెళ్ళికి అనసూయ తండ్రి ససేమీరా అనడం.. సరే మనం పెళ్లి చేసుకుందామని భరద్వాజ్‌ని అనసూయ అడిగినా పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకుందామని భరద్వాజ్ అన్నాడట. పెద్దవాళ్ళని ఒప్పించి ప్రేమించిన తొమ్మిదేళ్లకి పెళ్లి చేసుకున్నామని చెబుతుంది అనసూయ. తండ్రి తన ప్రేమను చాలా కాలం ఒప్పుకోలేదని చెప్పిన అనసూయ తన ప్రేమ కష్టాలను ఏకరువు పెడుతుంది.

This is The Anasuya and Bharadwaj Love story:

 Anasuya and Bharadwaj Love story.. interesting 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs