Advertisement
Google Ads BL

బన్నీ పుష్పలో లవ్ ట్రాక్ లేనట్టే..?


దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ ఇండస్ట్రీ హిట్ ని అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో బద్దలు కొట్టాడు. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న చిత్రమే పుష్ప. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రివేంజ్ డ్రామాగా రూపొందుతుంది.

Advertisement
CJ Advs

పుష్ప ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేష స్పందన వచ్చింది. మాస్ లుక్ లో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. అల్లు అర్జున్ మాస్ గా కనిపిస్తున్నాడంటే హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక లుక్ కూడా అలాగే ఉంటుందని అర్థమైపోయింది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మధ్య రంగస్థలం మాదిరి లవ్ ట్రాక్ ఉంటుందేమో అనుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి మధ్య ఎలాంటి లవ్ ట్రాక్ ఉండదట.

సినిమా మొదటి నుండి వీరిద్దరు భార్యాభర్తలుగానే కనిపిస్తారట. అంతేకాదు చిత్తూరు ప్రాంత యాసలో వీరిద్దరి మాట్లాడుకునే మాటలు చాలా బాగుంటాయట. భార్యభర్తలుగా వీరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండనుందని అంటున్నారు. ఇప్పటి వరకు ప్రేమికుల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో చూపించిన సుకుమార్, మొదటిసారిగా భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమని చూపించబోతున్నాడని అంటున్నారు.

There is no love track in Bunny Pushpa..?:

No seperate love track in Bunny Pushpa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs