Advertisement
Google Ads BL

చరణ్ కాదంటే నేను రెడీ అంటున్న మహేష్


కొరటాల శివతో చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నాడు. చాలా కాలం స్క్రిప్ట్ మీదే కూర్చున్న కొరటాల, చిరు ఆచార్య సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్ర రాసుకుని.. అది చరణ్ చేస్తే బావుంటుందని చిరుని అడగగా.. చిరు కూడా ఓకే అనడంతో.. చాలా హ్యాపీ గా రామ్ చరణ్ కి తన పాత్ర గురించి చెప్పగా వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడని చెబుతున్నాడు కొరటాల. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న కొరటాల శివ రెండు నెలల జీతాలు పనివాళ్ళకి ఇచ్చేసి పంపించేసి.. ఇంట్లో పనులను అందరు కలిసి పంచుకుని చేస్తామని చెబుతున్నాడు. కొరటాల శివ మహేష్ తో హ్యాట్రిక్ మూవీ అవకాశం వస్తుంది అని.. ఇప్పటికే రెండు సినిమాల హిట్ ఇచ్చిన మహేష్ కి.. మూడో సినిమా మహేష్ తో చేస్తే అది చాలా పెద్ద కథ, భారీ బడ్జెట్ తో ఉండబోతుంది అని చెబుతున్నాడు కొరటాల. అంటే మహేష్ బాబు తో హ్యాట్రిక్ కొట్టాలంటే కొరటాల కూడా పాన్ ఇండియా లెవల్ కి వెళ్లాల్సిందే అన్నమాట.

Advertisement
CJ Advs

ఇక కరోనా తో RRR సినిమా షూటింగ్ వాయిదా పడడం.. దానితో ఆచార్య సినిమా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అవుతుంది అని ప్రచారం జరగడంతో కొరటాల శివకి టెన్షన్ పట్టుకుందట. రామ్ చరణ్ కి RRR తో డేట్స్ అడ్జెస్ట్ కాకపోతే ఆచార్య ని ఏం చెయ్యాలో కొరటాలకు అర్ధం కావడం లేదట. తాజాగా మహేష్ తో ఫోన్ మాట్లాడిన కొరటాల తన ఆచార్య టెన్షన్ గురించి చెప్పగా.. మహేష్ వెంటనే మరీ టెన్షన్ అనుకుంటే నేనున్నానుగా అనేసరికి కొరటాల షాకయ్యాడట. అసలు పాత్ర ఏమిటో తెలియదు, పాత్ర పరిధి ఎంతో తెలియదు. అసలు ఆచార్య కథ తెలియకుండా మహేష్ అలా మాటిచ్చేసరికి అంత పెద్ద హీరో అయ్యుండి ఇలా మహేష్ అనేసరికి నాకు చాలా ధైర్యం వచ్చేసింది. అదే విషయాన్నీ తన సన్నిహితులతో పంచుకోగా.. ఆ న్యూస్ రకరకాలుగా ప్రచారం జరిగింది అంటూ.. మహేష్ ఆచార్యలో నటిస్తున్నాడని జరిగిన ప్రచారంపై కొరటాల చెప్పుకొచ్చాడు.  స్పందించాడన్నమాట.

Koratala gives Clarity on Mahesh Babu in Acharya:

Mahesh Babu Reaction on Koratala Siva Tension 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs