Advertisement
Google Ads BL

అన్నీ ఉన్నా ఆ ఒక్కటే కలిసి రావట్లేదు..


సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే కావాల్సిన చాలా వాటిలో మొదటి స్థానం మాత్రం అదృష్టానికే ఉంటుందని చెప్పవచ్చు. ఎంతోమంది నటీనటులు సూపర్ గా యాక్ట్ చేస్తుండవచ్చు. ఇప్పుడున్న చాలా మంది హీరోలకంటే బెస్ట్ డాన్సర్స్, బెస్ట్ పర్ ఫార్మర్స్ ఉంటుండవచ్చు. కానీ వాళ్ళకి అవకాశం రాకుండా ఉందంటే కారణం అదృష్టమనే చెప్పాలి. అయితే ఆ అదృష్టం కూడా సింగిల్ గా రాదు. కృషి చేస్తేనే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది.

Advertisement
CJ Advs

కొందరు కృషి చేసినా నిర్వహణ లోపాల వల్ల మంచి మంచి అవకాశాలని చేజార్చుకుంటారు. అలా మిస్ చేసుకున్నావారిలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఆర్ ఎక్స్ 100 సినిమాలో ఆమె నటనకి, గ్లామర్ కి అందరూ ఫిదా అయ్యారు. స్టార్ హీరో పక్కన నటించడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఆమెకి ఉన్నాయని భావించారు. కానీ ఆమెలోని మేనేజింగ్ లోపం వల్ల అవకాశాలు రాకుండా పోయాయి.

ఆర్ ఎక్స్ 100 తర్వాత ఆర్డీఎక్స్ లవ్ అంటూ పెద్ద బాంబ్ పేల్చింది. ఆ తాకిడికి ఆమెని హీరోయిన్ గా తీసుకుందాం అనుకునే వాళ్లంతా వెనక్కు తగ్గారు. ప్రస్తుతం బాలయ్య- బోయపాటి సినిమాలో ఒకానొక పాత్రకోసం ఆమెని అనుకున్నారట. కానీ ఏమైందో ఏమో చివరి నిమిషంలో ఆమె స్థానంలో కొత్త హీరోయిన్ ని ఎంచుకున్నారట. అన్నీ ఉన్నా కూడా అదృష్టం కలిసిరాకపోవడం వల్ల మంచి మంచి ఛాన్సెస్ కోల్పోతుంది.

She deserves to be star heroine but..:

Payal Rajput missed chance in Balayya boyapti movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs