Advertisement
Google Ads BL

పవన్‌ బాబాయ్‌లో నచ్చే క్వాలిటీ అదే: వరుణ్


మెగా హీరో వరుణ్ తేజ్ క్వారంటైన్ టైమ్‌లో తన ఆఫీస్‌కే పరిమితమయ్యాడు. బాక్సర్ గా నటించబోయే సినిమా కోసం బాక్సింగ్ నేర్చుకుంటున్న వరుణ్ తేజ్ కరోనా తో తన ఆఫీస్ లోనే తన ట్రైనర్ తో పాటుగా స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. తాజాగా అభిమానులతో ఫేస్ బుక్ లైవ్ చాట్ కొచ్చిన వరుణ్ తేజ్ చాలా విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. అందులో భాగంగా తనకి హరీష్ శంకర్ అంటే క్రష్ అని.. గద్దలకొండ గణేష్ చేసినప్పటి నుంచి హరీష్ శంకర్ అంటే క్రష్ ఏర్పడిందని తెలిపాడు. అలాగే చరణ్‌తో పాటుగా గుర్రపు స్వారీ నేర్చుకునే టైం లో గుర్రం పై నుండి పడిపోవడంతో.. అప్పటినుండి గుర్రాల వైపు కూడా వెళ్లలేదని తెలిపాడు వరుణ్ తేజ్.

Advertisement
CJ Advs

ఇక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ లో ఆయన నిజాయితీ నచ్చుతుంది అని... పెదనాన్న చిరు లో అందరిని ప్రోత్సహించే గుణం ఇష్టమని, ఇక రామ్ చరణ్ తనకి భాయ్ అంటున్నాడు వరుణ్ తేజ్. ఇక అల్లు అర్జున్ లో, రామ్ చరణ్ లో నచ్చే గుణాలు వాళ్ళు కష్టపడే మనస్తత్వం అంటున్నాడు. ఇక లాక్ డౌన్ సమయంలో గద్దల కొండ గణేష్ చిత్రాన్ని పదకొండు సార్లు చూసా అని ఎవరో తెలుపగా.. ఆ చిత్రంలోని తన పాత్ర అంటే తనకి చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడీ మెగా హీరో.

Varun Tej Talks about Pawan Kalyan:

Varun Tej Chit Chat with netizens
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs