Advertisement
Google Ads BL

అనిల్ రావిపూడి మార్చుకోవాల్సింది అదే...!


అపజయమే ఎరుగకుండా వరుసగా విజయాలు పొందుతున్న దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకడు. పటాస్ సినిమాతో దర్శకుడిగా మారి, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక్కో దర్శకుడికి ఒక్కో బలం ఉంటుంది. అలా అనిల్ రావిపూడి బలం కామెడీ. మొదటి సినిమా నుండి మొదలు పెడితే మొన్న సరిలేరు నీకెవ్వరు వరకు అనిల్ నమ్ముకున్నది కామెడీనే. జనాల్ని ఎంటర్ టైన్ చేయాలంటే నవ్వించాలి అని బాగా తెలుసుకున్నాడు.

Advertisement
CJ Advs

అయితే గత రెండు సినిమాల నుండి చూస్తే అనిల్ కామెడీ మరీ ఓవర్ డోస్ అయినట్టు అనిపిస్తుంది. ఎఫ్ 2 చిత్రంలో మెహ్రీన్ పాత్రగానీ, అలాగే సరిలేరు లో రష్మిక పాత్ర కొంచెం అతిగా అనిపిస్తుంటుంది. నిజజీవితంలో మనం అలాంటి పాత్రలని దాదాపుగా చూడము. అందుకే జనాలు వాటికి రిలేట్ కాలేకపోయారు. సినిమాలు హిట్ అయినా కూడా ఆ పాత్రల్ని విమర్శించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడట.

అందులోనూ మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుందని, ఎఫ్ 2 మాదిరిగానే ఎఫ్ ౩ లోనూ ఆమె పాత్ర స్వభావం అలాగే ఉంటుందని అంటున్నారు. ఎఫ్ 2 వచ్చిన సమయంలో బాక్సాఫీసు వద్ద సినిమాలేమీ లేకపోవడం బాగా కలిసొచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితి అలా ఉండకపోవచ్చు. కాబట్టి అనిల్ రావిపూడి ఆ పాత్రని మార్చుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. లేదంటే ఇప్పటి వరకు అపజయం ఎరగకుండా దూసుకుపోతున్న అనిల్ కి ఆ పాత్ర స్వభావం బ్రేకులు వేసే అవకాశం ఉంది.

He has to change character of the film:

Anil Ravipudi has to change that character
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs