Advertisement
Google Ads BL

12 ఏళ్ల తర్వాత ‘వకీల్ సాబ్‌’తో ఇలియానా!?


గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి.. తన రేంజ్‌ ఏంటో చూపించేసింది. అంతేకాదు.. కాస్త అటు ఇటు ఓ రేంజ్‌ హీరో స్థాయిలో పారితోషికం తీసుకుంటూ ఉండేదంటే అర్థం చేసుకోవచ్చు. అయితే.. టాలీవుడ్‌ను ఏలేసిన ఇల్లీ.. బాలీవుడ్‌ను బాగా దున్నేద్దాం అని వెళ్లి ఒకట్రెండు సినిమాలకే చతికిలపడింది. ఆ దెబ్బతో అప్పట్నుంచీ ఇప్పటి వరకూ కోలుకోలేకపోతోంది. అప్పట్లో టాలీవుడ్‌పై ఇష్టానుసారం మాట్లాడేసింది. దీంతో కష్టకాలంలోనూ తెలుగులో దాదాపు అవకాశాలు కరువైపోయాయి. అటు బాలీవుడ్‌లో.. ఇటు టాలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడంతో చేసేదేమీ లేక ప్రేమలో పడటం.. బ్రేకప్ అవ్వడంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆపసోపాలు పడుతోంది. 

Advertisement
CJ Advs

ఇల్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి దారులన్నీ మూసుకుపోవడంతో ఓ ప్రముఖ స్పోర్ట్స్ చానెల్‌లో యాంకర్‌గా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవలే వార్తలు వినిపించాయ్. తెలుగులో ఒకటి, బాలీవుడ్‌లో ఒక సినిమాకు కమిట్మెంట్ ఇచ్చానని పూర్తవ్వగానే రంగంలోకి దిగుతానని చెప్పినట్లు కూడా టాక్ నడిచింది. ఈ పుకార్లు నడిచి కొన్ని రోజులు కూడా నడవక ముందే అబ్బే అదేం లేదు.. మళ్లీ టాలీవుడ్‌లోకి ఇల్లీ బేబీ రీ ఎంట్రీ ఇస్తోందని ఫిల్మ్‌నగర్‌లో కొత్త పుకార్లు పుట్టుకొచ్చాయ్. అదేమిటంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీలో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఓ హీరోయిన్‌ను తీసుకోవాల‌ని.. శృతి హాసన్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాను నటించట్లేదని ఆ బ్యూటీ క్లారిటీ కూడా ఇచ్చేసింది.

దీంతో ఇల్లీ బేబీనే ఎంపిక చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వన్ భార్య పాత్రలో నటించనుందట. మరి యాంకరింగ్‌ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిన ఆ భామ పవన్ సరసన నటిస్తుందా..? నటించడానికి ఒప్పుకుంటుందో... లేదో..!?. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ‘జల్సా’లో రొమాన్స్ చేశారు. ఒకవేళ ‘వకీల్ సాబ్’ నటించడానికి ఒప్పుకున్నట్లయితే 12 ఏళ్ల తర్వాత మరోసారి కనువిందు చేయబోతున్నారేమో. దీనిపై క్లారిటీ రావాలంటే కరోనా లాక్‌డౌన్ ముగిసే వరకూ వేచి చూడాల్సిందే.

Ileana D’Cruz To Play Pawan Kalyan’s Wife In Vakeel Saab?:

 Ileana D’Cruz To Play Pawan Kalyan’s Wife In Vakeel Saab?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs