తెలుగులో యాంకర్లలో ఓ వెలుగు వెలిగిన అడ్రస్ లేకుండా పోయిన లాస్య ఈ మధ్య మళ్లీ యాక్టివ్ అయ్యింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇటు వెండితెర.. అటు బుల్లితెరపై కనిపించకుండా పోయిన ఈ యాంకరమ్మ రీ ఎంట్రీ ఇచ్చేసింది. అప్పట్లో యాంకర్ సుమ తర్వాతి స్థానంలో లాస్యనే ఉండేది. ఇప్పుడు ఆ స్థానం పూర్తిగా కోల్పోయింది.. సుమ తర్వాత అనసూయ, రష్మి, శ్రీముఖి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. అయితే రీ ఎంట్రీతోనే యాంకర్ రవి భరతం పట్టాలని లాస్య అనుకుంటోందని తెలుస్తోంది. లాస్య ఒక్కటే కాదండోయ్ శ్రీముఖీ కూడా ఇదే బాటలో నడుస్తోందట. ఇంతకీ ఈ ఇద్దరూ కలిసి ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం.
అన్నీ పుకార్లే..!
లాస్యకు రవికి సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అని అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయి లాస్య పెళ్లి చేసుకుందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఆ స్థానంలో శ్రీముఖి రాగా.. సేమ్ అదే పుకార్లు వచ్చాయ్.. అంతేకాదు బిగ్‌బాస్-03 షో వేదికగా తన లవ్ గురించి.. మోసం చేసిన వ్యక్తి గురించి చెప్పగా.. అవన్నీ రవి గురించేనని పెద్ద హడావుడే జరిగింది. ఆ తర్వాత షో నుంచి బయటికొచ్చాక రవితో స్టేజ్ పంచుకోవడానికి ఈ అల్లరి పిల్ల సాహసించలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య సేమ్ టూ సేమ్ లాస్య పరిస్థితే అని టాక్ కూడా నడిచింది.
ఇదే జరిగితే..!
అయితే.. లాస్య, శ్రీముఖీ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఉగాది పర్వదినాన ఓ షోలో ఇద్దరూ కలిసి కనిపించారు. త్వరోనే వీరిద్దరూ కలిసి ఓ భారీ ప్రోగ్రాంతో ప్రేక్షకుల ముందు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పాటికే ఆ షో ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా హడావుడితో అది కాస్త ముందుకెళ్లలేదట. ఈ క్రమంలో రవిపై ఇద్దరూ రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తున్నట్లు తెలియవచ్చింది. ఆ షో ప్రారంభానికి ముందు ఇద్దరూ ఓ ప్రముఖ యూట్యూబ్, ఎంటర్‌టైన్మెంట్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారట. ఇందులో రవి గురించి బండారం మొత్తం బయటపెడతారట. అంటే ఈ చానెల్ ద్వారా రివెంజ్ తీర్చుకోబోతున్నారన్న మాట. ఒకవేళ ఇదే నిజమైతే.. రవితో ఈ ఇద్దరికీ సమ్‌థింగ్ సమ్‌థింగ్ నిజమే అయితే ఎవరూ ఊహించని విషయాలన్నీ బయటికొస్తాయేమో. అసలు ఇది ఎంతవరకూ వర్కవుట్ అవుద్దో.. ఇందులో నిజానిజాలెంతో.. ఒకవేళ నిజమే అయితే రవి పరిస్థితేంటో తెలియాలంటే లాక్‌డౌన్ ఎత్తేసే వరకూ వేచి చూడాల్సిందే.