Advertisement
Google Ads BL

సుజీత్‌ అనగానే మెగాఫ్యాన్స్ వర్రీ అవుతున్నారా?


చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి.. రామ్ చరణ్ తో కలిసి సినిమాలను ఎంచుకోవడం, దర్శకులను లైన్ లో పెట్టడం చేస్తున్నాడు. చిరుకి వినాయక్ ని ఖైదీ నెంబర్ 150 కి తగిలించింది చరణే. ఇక ధ్రువ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి తో తన తండ్రి కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైరా చేయించాడు. ఇక రామ్ చరణ్ కోసం వచ్చిన కొరటాలకు చిరు ఆచార్య సినిమా తగిలించాడు. తాజాగా సాహో దర్శకుడు సుజిత్.. రామ్ చరణ్ కోసం కథ తెస్తే.. చిరు తో లూసీఫర్ రీమేక్ చెయ్యాలని సూచించాడు. చిరు కోసం మలయాళ లూసీఫర్ హక్కులు కొన్న రామ్ చరణ్.. ఆ సినిమా కోసం సుకుమార్ దగ్గరనుండి, దర్శకుడు బాబీ వరకు పేర్లు పరిశీలించినప్పటికీ.. చివరికి సాహో దర్శకుడు సుజిత్ లూసీఫర్ రీమేక్ దర్శకుడుగా ఎంపికయ్యాడు.

Advertisement
CJ Advs

ఈ విషయాన్నీ తాజాగా చిరంజీవే కన్ఫర్మ్ చేసాడు. లూసీఫర్ రీమేక్ కోసం సుజీత్‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని రామ్ చరణ్ త‌న‌కు సూచించిన‌ట్లు చిరు వెల్ల‌డించాడు. ఈ సినిమాకి చరణే నిర్మాతగా వ్యవహరిస్తాడని చెప్పాడు. ప్రస్తుతం సుజిత్ లూసీఫర్ రీమేక్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని.. తెలుగు నేటివిటీకి సంబంధించిన కొన్ని మార్పులు చేస్తున్నాడని చిరు చెబుతున్నాడు. అయితే మెగా ఫ్యాన్స్‌కి సుజిత్ లూసీఫర్ రీమేక్ దర్శకుడు అనగానే కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే భారీ బడ్జెట్‌తో సాహో సినిమా చేసిన సుజిత్.. ఆ సినిమాతో ఘోరంగా విఫలమయ్యాడు. అలాంటి దర్శకుడిని నమ్మి చిరు లూసీఫర్ రీమేక్ చిత్రం ఎలా ఇచ్చాడు అంటున్నారు. చరణ్ - చిరు ఈ విషయంలో రాంగ్ స్టెప్ వేశారేమో అంటున్నారు. లూసీఫర్ లాంటి రాజ‌కీయాలు, సెంటిమెంట్ల చుట్టూ తిరిగే థ్రిల్ల‌ర్ మూవీని సుజిత్ ఎలా డీల్ చేస్తాడ‌న్న‌ది మెగా ఫ్యాన్స్‌లో అనుమానంగానే ఉందట. 

Mega Fans Reaction on Lucifer Movie Remake Director:

Lucifer Movie Remake Director Confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs