Advertisement
Google Ads BL

అట్లీతో జూనియర్ ఎన్టీఆర్ మూవీ లేనట్టేనా!?


ఓటమెరుగని దర్శకుడిగా పేరుగాంచిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టా్త్మక, భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఈ సినిమాలో స్టారో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు జూనియర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే జూనియర్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా రోజులుగా కుర్ర డైరెక్టర్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ వేయి కళ్లతో వేచి చూస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం అస్సలు అవకాశం ఇవ్వట్లేదు. ‘అరవింద సమేత’ నుంచి ఇప్పటి వరకూ వేచి చూసినప్పటికీ అట్లీ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. అసలు ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుందా..? లేదా..? అనేది మాత్రం తెలియట్లేదు.

Advertisement
CJ Advs

అదేమీ లేదు.. త్రివిక్రమ్ తర్వాత కచ్చితంగా ఈ కాంబోలో సినిమా ఉంటుందని అభిమానులు మాత్రం గట్టిగా విశ్వసిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే జూనియర్ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో అట్లీ మాత్రం ఎదురుచూపులకే పరిమితం అయ్యాడు. మాస్‌, లవ్ స్టోరీలను తెరకెక్కించడంలో అట్లీకి కోలీవుడ్‌లో మంచి పేరు ఉంది. సింగిల్ సినిమా.. ‘రాజా రాణి’తో దర్శకుడిగా మారిన అట్లీ కుమార్.. ఇప్పుడు వరస విజయాలతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. 

అలా.. కోలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఎప్పట్నుంచో  తెలుగు ఇండస్ట్రీకి రావాలని.. అది కూడా జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాతోనే అడుగుపెట్టాలని భావిస్తున్నాడు. జూనియర్ అంటే అట్లీకి అమితమైన ఇష్టమని ఇప్పటికే పలుమార్లు ఎన్టీఆర్ గురించి ఇంటర్వ్యూలు, హైదరాబాద్‌లో జరిగిన పలు సినిమా ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు. మరి జూనియర్ ఎప్పుడు అవకాశం ఇస్తాడో.. అట్లీ ఆ అవకాశాన్ని ఎప్పుడు సద్వినియోగం చేసుకుంటాడో.. అసలు ఇది ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో జస్ట్ వెయిట్ అండ్ సీ.

News About Director Atlee and Jr Ntr!:

News About Director Atlee and Jr Ntr!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs