Advertisement
Google Ads BL

‘కత్తి’ కనిపించట్లేదేం.. ఏమైపోయాడో!?


సినిమా క్రిటిక్ కత్తి మహేశ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే కత్తి గురించి అస్సలే చెప్పాల్సిన పన్లేదేమో. మూడు ట్వీట్స్.. ఆరు తిట్లు తినడమే ఆయన పని. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్జీవీ తర్వాత సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేయడం.. ప్రతి విమర్శలు చేయించుకోవడంలో కత్తికి వెన్నతోపెట్టిన విద్య అని అప్పట్లో నెటిజన్లు విమర్శిస్తుండే వారు. పవన్‌పై నిత్యం ట్వీట్స్ చేస్తూ అలా అలా సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో కొద్దిరోజుల పాటు అడ్రస్ లేకుండా పోయాడు. మళ్లీ రంగంలోకి దిగి యాక్టివ్ అయ్యాడు.. అప్పటికీ పవన్‌ను విమర్శించడం మాత్రం అస్సలు మాన్లేదు. అలా గతేడాది నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు కత్తి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఏమైపోయాడు..!?

గత కొన్ని నెలలుగా కత్తి సోషల్ మీడియాలో కనిపించట్లేదు.. అంతేకాదు జనాలకూ కనిపించట్లేదు. అసలు కత్తి ఏమయ్యాడో..? ఏమైపోయింటాడో..? ఏంటో..? అని నెట్టింట్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. నెటిజన్లు ఒకరిద్దరు కత్తి ప్రస్తావన తీసుకురాగా.. ఇంకొందరు మాత్రం కామెంట్స్ తెగ చేసేస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఎవరికి తోచిన సలహాలు, సూచనలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.. మరోవైపు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన చారిటీకి విరాళాలు ప్రకటిస్తున్నారు. అసలు ఇక్కడ కూడా కత్తి కనిపించలేదు. పోనీ సోషల్ మీడియాలోనూ లేడు. దీంతో నెటిజన్లు అసలు ఏమైపోయింటాడు..? అని చిత్ర విచిత్రాలుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

రియాక్షన్ ఉంటుందా..?

ఆయన అభిమానులు మాత్రం మా కత్తి అమెరికాలో ఉందని.. కాదు కాదు సొంతూరిలో ఉందని ఇంకొందరు ఇలా కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి కత్తి సతీమణి అమెరికాలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చిన విషయం విదితమే. కరోనా కష్ట కాలంలో భార్య దగ్గరికి వెళ్లాడని.. ఇంకొందరేమో లేదు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడని.. అబ్బే హైదరాబాద్‌లో ఉన్నాడు.. హాయిగా కరోనా రెస్ట్ తీసుకున్నాడని అభిమానులు చెప్పుకుంటూ ఉన్నారు. కత్తి ఎక్కడున్నాడో రియాక్ట్ అయితే కానీ అభిమానుల ఎదురుచూపు.. నెటిజన్ల చిత్ర విచిత్రాల కామెంట్స్ ఆగేలా లేవ్.. ఇక లేటెందుకు కమాన్.. ట్విట్టరెక్కు లేదా.. పోస్ట్‌లతో ఫేస్‌బుక్ ఎక్కిక కత్తి..!.

What Happend To Critic Kathi Mahesh..!:

What Happend To Critic Kathi Mahesh..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs