నాగ చైతన్య - సమంతలు కరోనా లాక్‌డౌన్‌ని అక్కినేని ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేస్తున్నారు. అంతే కాకుండా నాగ చైతన్య చేసే రకరకాల వంటలను సమంత ఆస్వాదిస్తోంది. తాజాగా సమంత కి వంట రాదంటూ ఓ సీక్రెట్ బయటపెట్టింది సామ్ అత్తగారు అక్కినేని అమల. అమల ని ఎపుడైనా సమంత అక్కినేని ఫ్యామిలీ మెంబెర్స్ కి వంట చేసి పెట్టిందా అని అడగగా.. సామ్ కి వంట రాదు,... మా ఇంట్లో నాగార్జునే బెస్ట్ కుక్. నాగార్జున రకరకాల వంటలతో అందరిని అలరిస్తారు. ఇక మా ఇంట్లో నాగ్ ఉండగా మరో కుక్ ఎందుకు అంటుంది అమల.
మరి నాగార్జున, నాగ చైతన్య వంటలు బాగా వండుతుంటే... ఇక అమల కానీ, సమంత కానీ వంట చెయ్యాల్సిన అవసరం ఏముంటుంది. ఇప్పటికే సమంత చైతు చేసే రకరకాల వంటలను, చైతు కిచెన్ లో ఉన్న ఫొటోస్ ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక నాగార్జున వైఫ్ అమలకి కూడా పెద్దగా వంట రాదట. ఇక నాగార్జున లాంటి బెస్ట్ కుక్ ఉంటే... మరొక కుక్ గురించి ఆలోచించడం ఎందుకు అంటుంది అమల. నిజమే నాగ చైతన్య, నాగార్జున అంతలా వంటలు చేస్తుంటే.. సమంతకి, అమలకి వంట చెయ్యాల్సిన ఖర్మేమిటి అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.