పొట్టి పొట్టి దుస్తులతో, హాట్ హాట్ ఫోటోషూట్లతో, బోల్డ్ క్యారెక్టర్లలో కనిపిస్తూ ఇటు బుల్లితెర మీదా, ఇటు వెండితెర మీద దూసుకుపోతుంది జబర్దస్త్ యాంకర్ రష్మి. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన రష్మి చాలా సినిమాల్లో నటించింది. జబర్దస్త్ కి రాకముందు ఆమె చాలా సినిమాల్లో నటించినా అవేమీ పేరు తీసుకురాలేదు. జబర్దస్త్ తో పేరుతో పాటు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. వస్తున్నాయి.
అయితే సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే రష్మీకి ట్రోలింగ్ తాకిడి చాలా ఎక్కువ. ఆమె వేసుకునే దుస్తుల గురించి, సినిమాల్లో చేసే పాత్రల గురించి ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. అయితే అలాంటి వాటికి రష్మీ చాలా ధీటుగా సమాధానమిస్తుంది. మొన్నటికి మొన్న అన్నీ బోల్డ్ తరహా క్యారెక్టర్లే ఎందుకు చేస్తారని అడిగితే, సతీ సావిత్రి లాంటి పాత్రలు చేయాలా అని కామెంట్ చేసింది.
ఇక తాజాగా మరో నెటిజన్ వేసిన ప్రశ్న, ఆమెని ఆగ్రహానికి గురి చేసింది. అయితే అదేమంత పెద్ద అడగకూడని ప్రశ్న కూడా కాదు. సాధారణంగా పెళ్ళి కాని ప్రతీ ఒక్క సెలెబ్రిటీకి పెళ్ళెప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నకి ఫైర్ అయిన రష్మీ, పెళ్ళి నా పర్సనల్ మ్యాటర్, వ్యక్తిగత విషయాలు నేనెవరికీ చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి విషయాలు నన్ను అడగొద్దు అని చెప్పింది.
పెళ్ళి గురించి అడిగితేనే ఇంత కోప్పడ్డ రష్మీకి, సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జనాలకి ఆసక్తి ఎక్కువగా ఉంటుందన్న తెలియదేమో..! అయితే ఇలాంటి విషయాల్లో ఎంత కోప్పడ్డ మళ్లీ మళ్లీ ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్లలో ఎలాంటి మార్పు రాదు.