Advertisement
Google Ads BL

ప్రభాస్ కోసం హైదరాబాదులో ఇటలీ..?


ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా లవ్  స్టోరీ తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. సాహో డిజాస్టర్ తర్వాత యూవీ క్రియేషన్ బ్యానర్ లో ఈ చిత్రం నిర్మితమవుతుంది. అయితే మొదటి నుండి ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగింది. దాంతో స్పీడ్ పెంచాలనే నిర్ణయాన్ని తీసుకుని షూటింగ్ కోసమని జార్జియా వెళ్లారు. కానీ కరోనా ప్రభావం వల్ల అక్కడి షెడ్యూలు పూర్తి కాకుండానే వెనక్కి వచ్చేశారు.

Advertisement
CJ Advs

కథానుగుణంగా యూరప్ లో జరిగే కథ కాబట్టి, సినిమాలో ఎక్కువ భాగం అక్కడే షూట్ చేయాలి. జార్జియా షెడ్యూల్ ముగించుకున్న తర్వాత ఇటలీ వెళ్లాల్సి ఉందట. అయితే ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే అక్కడికి వెళ్ళడం చాలా రిస్క్. అదీ గాక వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. కరోనా నుండి పూర్తిగా బయటపడిన తర్వాత కూడా వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఇటలీ సెట్ ని హైదరాబాలో వేయనున్నారట.

సినిమా షూటింగ్ కి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే ఇటలీ సెట్ ని హైదరాబాద్ లో వేసి కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ వాటికి కావాల్సిన డిజైన్లు రెడీ చేసే పనుల్లో ఉన్నాడని సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే ఈ సినిమా కోసం ప్రపంచాన్నే హైదారాబాద్ కి తీసుకొస్తున్నారన్నమాట.

Italy set in hederabad for Prabhas movie..?:

Italy set will be in hyderabad for Prabhas movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs