Advertisement
Google Ads BL

నిర్మాతలను భయపెడుతున్న రమ్యకృష్ణ!


జాతీయ ఉత్తమ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అంధాదున్’ చిత్రం బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఖురానా, రాధికా ఆప్టే, ట‌బు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగు హక్కులను హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సొంతం చేసుకుకోగా ఆ రీమేక్‌లో నితిన్ హీరోగా వస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎవరు తెరకెక్కిస్తారనే విషయం క్లారిటీ రాలేదు కానీ పలువురి పేర్లు మాత్రం తెరపైకి వస్తున్నాయ్. తెలుగులో టబు పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. 

Advertisement
CJ Advs

వాస్తవానికి మొదట హాట్ యాంకర్ అనసూయ పేరు వినిపించడానికి సీనియర్ అయితే బాగుంటుందని భావించి రమ్యకృష్ణను ఫైనల్ చేసేశారట. అయితే.. ఈ విషయమై ఆ నటిని సంప్రదించగా భారీగా డిమాండ్ చేసిందట. ఆమె అడిగిన పారితోషికానికి సంప్రదించిన నిర్మాతలు భయపడిపోయారట. ఇంచుమించు హీరోయిన్ రేంజ్‌లో అడిగిందని టాక్. ఏంటి మేడం తగ్గేది ఉండదా..? అని మరోసారి అడగ్గా అస్సలు లేనే లేదని తేల్చి చెప్పేసిందట. దీంతో లాక్‌డౌన్ తర్వాత మరోసారి అడిగి వర్కవుట్ అయితే సరే లేకుంటే మన తెలుగువారినే తీసుకోవాలని అనుకుంటున్నారట. అంటే అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అనసూయ దగ్గరే ఆ పాత్ర వచ్చి వాలుతుందో ఏంటో జస్ట్ వెయిట్ అండ్ సీ.

Producers Fear About Actress Ramya Krishna Remuneration:

Producers Fear About Actress Ramya Krishna Remuneration  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs