కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్డౌన్ నియమాన్ని పాటిస్తున్నా కూడా కరోనా బారిన పడ్డ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నారు. అందువల్ల లాక్డౌన్ నియమాన్ని మరో 18 రోజులు పొడిగిస్తూ ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ వల్ల సినిమా థియేటర్లు మూతబడి వాటి యాజమాన్యం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుంది. లాక్డౌన్ పూర్తయ్యాక కూడా జనాలు సినిమాలు చూడడానికి థియేటర్లకి వస్తారా అన్న సందేహం కలుగుతుంది.
బయటకి రావడానికే భయపడుతున్న సమయంలో జనాలు డబ్బులు పెట్టి సినిమా చూడడానికి రావడం కష్టమే. అదీ గాక లాక్డౌన్ ఎత్తివేసినా కూడా థియేటర్లు, మాల్సు తెరుచుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. అయితే ఒక్కసారి థియేటర్లకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మొదటగా రిలీజ్ అయ్యే మూవీ ఏదై ఉంటుందనేది ఆసక్తిగా మారింది. జనాల్లో థియేటర్ల మీద నమ్మకం కలిగించి, జనాలని థియేటర్లకి తీసుకువచ్చే సత్తా ఎవరికి ఉందని ఆలోచిస్తున్నారు.
అలాంటి నమ్మకం కలిగించే సినిమా పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ అని నమ్ముతున్నారు. రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఆయన అభిమానులు వకీల్ సాబ్ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అదీ గాక ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది కూడా. కాబట్టి వకీల్ సాబ్ చిత్రం లాక్డౌన్ తర్వాత మొదటి సినిమా అయ్యే అవకాశం ఉంది.