ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే ‘అయినను పోయిరావలె హస్తినకు’ (వర్కింగ్ టైటిల్) సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా కాస్త ఆలస్యం అయ్యేలా కనబడుతుంది. మాములుగా అయితే ఈ మే నుండి ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. RRR షూటింగ్ చివరి దశలో ఉండడంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీని ప్రకటించాడు. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ పకడ్బందీగా లాక్ చేసాడట. ఇక నటీనటుల ఎంపిక కూడా చేపట్టిన త్రివిక్రమ్ విలన్ కేరెక్టర్‌ని స్ట్రాంగ్ గా రాసుకున్నాడట. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విలన్ పాత్ర స్ట్రాంగ్‌గా ఉండబోతుంది.
అయితే ఆ పాత్ర పక్కా రాజకీయాలతో ముడి పడి ఉంటుందని.. అందుకే ఆ పాత్రకి బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందట. రాజకీయాలకి ఓ కొత్త ఒరవడిని పరిచయం చేసేలా ఎన్టీఆర్ పాత్రను రాస్తున్నాడట త్రివిక్రమ్. ఇక విలన్ పాత్ర కోసం త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మైండ్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఉన్నాడట. సంజయ్ దత్‌ని మనసులో ఉంచుకునే త్రివిక్రమ్ ఆ పాత్రని రాసుకున్నాడట. ఇక త్రివిక్రమ్ గత సినిమాల వలే.. ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారట. అందులో ఒకరు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, రెండవ హీరోయిన్ పూజ హెగ్డే అంటూ ఓ న్యూస్ ప్రచారంలో ఉంది. అయితే ఇవన్నీ చూస్తుంటే మాత్రం త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా ప్లాన్‌లో ఉన్నారేమో అనిపిస్తుంది.