Advertisement
Google Ads BL

సోనాక్షి వల్ల ఇబ్బంది పడ్డ హీరో..


సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ప్రపంచం. ఎన్నో రంగులు మన కళ్లముందు కనిపిస్తాయి. అయితే కొన్ని సార్లు  కనిపించేదంతా నిజంకాకపోవచ్చు. ఈ గ్లామర్ ప్రపంచం గురించి తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి వల్లనే అనేక పుకార్లు పుట్టుకొస్తాయి.  అయితే చాలా సందర్భాల్లో ఆ పుకార్లు నిజం అవుతాయి కూడా. కొన్ని సార్లు అది వట్టి గాలివార్తగా మాత్రమే మిగిలిపోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సోనాక్షి సిన్హా యంగ్ హీరోతో డేటింగ్ లో ఉందన్న రూమర్ చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చిన జహీర్ ఇక్బాల్ తో ఆమె ప్రేమాయణం సాగిస్తుందని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ మీడియా కోడై కూయడంతో, ఈ విషయమై క్లారిటీ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు జహీర్. సోనాక్షితో తాను డేటింగ్ లో ఉన్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మేము జస్ట్ స్నేహితులం మాత్రమే. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది అని చెప్పాడు.

అయితే ఈ పుకార్ల వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డాడట. జహీర్ మరో అమ్మాయితో డేట్ లో ఉండగా, సోనాక్షితో డేట్ లో ఉన్నట్టు వార్త రావడం కొంత ఇబ్బంది పెట్టిందట. తాను వేరే అమ్మాయితో డేట్ లో ఉన్నానన్న విషయం సోనాక్షికి తెలుసు కాబట్టి ఆమె ఈ వార్తలని లైట్ తీసుకుందట.మొత్తానికి సోనాక్షితో ప్రేమాయణం గాలివార్తే అని తేటతెల్లమైంది.

Bollywood revealed about his affair with Sonakshi Sinha:

Bollywood hero Zaheer iqbql revealed about his affair with Saonakdhi Sinha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs