Advertisement
Google Ads BL

బాలయ్య కోసం ఇద్దరు హీరోయిన్లు..?


రూలర్ చిత్ర ఘోర పరాజయం తర్వాత బాలయ్య, బోయపాటి సినిమాలో నటిస్తున్నాడు. బోయపాటితో బాలయ్య నటిస్తున్న మూడవ చిత్రమిది. ఇంతకుముందే చేసిన రెండు చిత్రాలు సింహా, లెజెండ్ ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. అందుకని ఈ మూడవ సినిమాపై బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అదీగాక రూలర్ వంటి డిజాస్టర్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నందున దర్శకుడు జాగ్రత్తగా డీల్ చేస్తాడని భావిస్తున్నారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ పాటికే షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉండగా, లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సమయంలో బోయపాటి స్క్రిప్టు పనులతో పాటు క్యాస్టింగ్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నాడట. అయితే ఈ సినిమాలో బాలయ్య పక్కన ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారనేది ఇంతవరకు తెలియదు. కీర్తి సురేష్ పేరు వినిపించినప్పటికీ ఆమె నటించడం లేదని వచ్చేసింది.

ఈ విషయమై బోయపాటి స్పందిస్తూ.. హీరోయిన్ గా రెండు పేర్లని పరిశీలిస్తున్నాడట. ఇద్దరి పేర్లని అనుకుని..వారిలో ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నాడట. అయితే ఆ ఇద్దరి పేర్లు ఏంటనేది మాత్రం తెలియదు. లాక్డౌన్ పూర్తయిన వెంటనే హీరోయిన్ విషయంలో క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఖుషి హీరోయిన్ భూమిక ఈ సినిమాలో లేడీ విలన్ గా నటిస్తుందని సమాచారం.

Boyapati choosing one from Two names..?:

Boyapati is busy in searching heroine for balayya 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs