Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ వీడియో కోసం వెయిటింగ్: నాగబాబు


రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR రౌద్రం రణం రుధిరం సినిమా పై భారీ అంచనాలున్నాయి. రామ్ చరణ్ పుట్టిన రోజునాడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రామ్ చరణ్ కసరత్తుల వీడియో ఇండియా వైడ్ గా వైరల్ అవడమే కాదు... సినిమాపై మరింత క్రేజ్ పెంచేసింది. అయితే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు స్పెషల్ వీడియో చూసాక అందరిలో ఎన్టీఆర్ కొమరం భీం వీడియో కోసం ఆసక్తి కాదు అంచనాలు పెరిగిపోయాయి. అందరిలో సినీ ప్రముఖులతో పాటుగా సాధారణ ప్రేక్షకుడి వరకు కొమరం భీం వీడియో కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. ఇక రామ్ చరణ్ బాబాయ్ నాగబాబు కూడా రామ్ చరణ్ అల్లూరి వీడియో చూసాక ఎన్టీఆర్ కొమరం భీం వీడియో కోసం తెగ వెయిట్ చేస్తున్నా అని చెబుతున్నాడు. కరోనా సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్న నాగబాబు ఫేస్ బుక్ లైవ్‌లో అభిమానుల అడిగిన ప్రశ్నకు ఆలస్యంగా స్పందించారు.

Advertisement
CJ Advs

RRR రామ్ చరణ్ స్పెషల్ వీడియోపై మీ స్పందన ఏమిటి అంటే.. అప్పుడు చెప్పని వారికీ తాజాగా ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇచ్చాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఆంధ్ర తెలంగాణ మన్యం వీరులని.. ఎవరికీ వారే శక్తివంతమైన వారని.. అలాంటి వారు కలిస్తే ఎలా ఉంటుందో RRR లో చూపిస్తారని అంటున్నారు. మరి అందులో నిజమెంతుందో తెలియదు కానీ... రామ్ చరణ్ అల్లూరి వీడియో చూసాక.. ఎన్టీఆర్ కొమరం భీం స్పెషల్ వీడియోపై ఆసక్తి పెరిగిపోయింది అంటూ RRR పై తన స్పందన తెలియజేసాడు నాగబాబు.

Nagababu waiting for Jr NTR Komaram Bheem Video:

Nagababu response on Netizens Question on RRR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs