నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించిన కామెడీ వెబ్ సిరీస్ ‘అసలేం జరిగిందంటే’
నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ అధినేత, ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘అసలేం జరిగిందంటే’. చందూ అల్లాడ దర్శకత్వం వహించిన ఈ కామెడీ వెబ్ సిరీస్‌లో వైవా హర్ష, యష్న చౌదరి నటించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎం.ఎక్స్ ప్లేయర్‌లో వీక్షించవచ్చు. లాక్‌డౌన్ సమయంలో చందు తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. గతం మరిచిపోయిన గయ్యాలి భార్యను భర్త(వైవా హర్ష) తనకు అనుకూలంగా ఎలా మలుచుకున్నాడు? అనేదే కథాంశం.