Advertisement
Google Ads BL

కరోనా ఎఫెక్ట్: పుష్ప నుండి ఆ నటుడు ఔట్..?


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూర్తి మాస్ లుక్ లో కనిపిస్తూ చేస్తున్న చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇంకా స్టార్ట్ అవలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ పాటికే మొదలవ్వాల్సింది. కానీ లాక్డౌన్ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని సుకుమార్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీ సహా దక్షిణాది భాషల్లో రిలీజ్ కానుంది.

Advertisement
CJ Advs

అయితే పాన్ ఇండియా ఇమేజ్ తీసుకురావడానికి బాలీవుడ్ నటుడిని విలన్ గా నటింపజేయాలని ఆలోచన చేస్తుండగా, సినిమా నుండి తమిళ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ సేతుపతి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసరుగా కనిపిస్తున్నాడట. అయితే కరోనా కారణంగా ఏప్రిల్ నెల మొత్తం లాక్డౌన్ ఉండడంతో డేట్లన్నీ వృధా అయిపోయాయి. దాంతో విజయ్ సినిమా నుండి తప్పుకోవాలని చూస్తున్నాడట.

అయితే ఆ పాత్రలో సుకుమార్ తమిళనటుడినే నటింపజేయాలని అనుకుంటున్నాడు.  ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ, దాదాపుగా విజయ్ నిర్ణయం తీసుకున్నట్టే అంటున్నారు. అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ సినిమా తీస్తుండగా, విజయ్ సేతుపతి సినిమా నుండి తప్పుకుంటే తమిళంలో సినిమాకి క్రేజ్ తగ్గిపోయే అవకాశం ఉంది. మరి ఆ క్రేజ్ తగ్గకుండా ఉండాలంటే సుకుమార్ ఏం చేస్తాడో చూడాలి.

He left from Allu Arjun Pushpa..?:

Vijay Sethupathi left from Pushpa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs