Advertisement
Google Ads BL

శింబు, ప్రభుదేవాలను అందుకే వదిలేశా: నయన్


కోలీవుడ్‌లో లేడి సూపర్ స్టార్ నయనతారకున్న క్రేజ్ కుర్ర హీరోయిన్స్ కి కూడా లేదు. స్టార్ హీరో లేంటి, కుర్ర హీరోలేంటి, లేడి ఓరియెంటెడ్ సినిమాలేంటి నయనతార తర్వాతే ఎవరైనా. సినిమాల్తో ఎప్పుడూ బిజీగా ఉండే నయనతార ప్రేమలోనూ బిజీనే. మొదట్లో హీరో శింబుతో ప్రేమ వ్యవహారం నడిపిన నయనతార తర్వాత దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమా పెళ్లి అంటూ హడావుడి చేసి మధ్యలోనే వదిలేసి.. మళ్ళీ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడుపుతూ సహజీవనం చేస్తున్న నయనతార తను రెండు సార్లు ప్రేమలో ఎందుకు విఫలమయ్యిందో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

Advertisement
CJ Advs

ప్రేమ అంటే నమ్మకం అని... నమ్మకం లేని చోట ప్రేమ ఉండదని చెబుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేనప్పుడు కలిసి జీవించడం ఎందుకు.. విడిపోవడమే బెటర్ అంటుంది. రెండుసార్లు తన ప్రేమ విఫలం కావడానికి ప్రేమలో నమ్మకం లేకపోవడమే అంటుంది నయనతార. ఆ నమ్మకం లేకనే శింబు, ప్రభుదేవాతో బంధాన్ని తెంచుకున్నా అని.. ప్రేమలో విఫలమైనప్పుడు ఎంతో నరకం అనుభవించానని.. కానీ బయట మాత్రం ఎవరిష్టమొచ్చినట్లుగా వారు మాట్లాడారని... ఆ బాధ నుండి బయటికి రావడానికి చాలా కాలం పట్టింది అని చెబుతుంది నయనతార. ఆ బాధ నుండి తేరుకోవడానికి వరస సినిమాలు చేశానని.. ఆ సినిమాలే తనని మనిషిని చేశాయి అని అంటోంది నయన్.

Nayanthara Opens Up On Love Failures:

Top Actress Opens Up On Love Failures
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs