కాజల్ అగర్వాల్ గత రెండుమూడేళ్లుగా అవకాశాల కోసం ఎదురు చూసింది.. ఇక కాజల్ పని ఖాళీ అన్నారు. కానీ కాజల్ అగర్వాల్ పని ఎప్పుడూ ఖాళీ కాదు.... కాజల్ పని అయిపోయింది అన్న టైం లో మళ్లీ సినిమాల్తో కాజల్ కెరటంగా ఎగురుతుంది. తాజాగా చిరంజీవి ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ త్రిష ప్లేస్ కి వచ్చేసింది. త్రిష వాకవుట్.. కాజల్ కి కలిసొచ్చింది. భారీ పారితోషకానికి చిరు సరసన ప్లేస్ కొట్టేసిన కాజల్.. ఇంతకు ముందే చిరు తో ఖైదీ నెంబర్ 150 లో నటించింది.
ఇక తాజాగా చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాలోనూ కాజల్ అగర్వాల్ హీరోయిన్ అనే టాక్ మొదలైంది. హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కబోయే మూవీ కోసం హరీష్ కాజల్‌ని సంప్రదించాడని.. కాజల్ కూడా కథ నచ్చి పవన్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు. కాజల్ - పవన్ కళ్యాణ్ కూడా గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ లో నటించారు. మరి గతంలో హరీష్ సినిమాలో పవన్ సరసన పూజ హెగ్డే అన్నారు కానీ.... తాజాగా కాజల్ పేరే ఫైనల్ అంటున్నారు. మరి ఒకేసారి అన్నదమ్ములను ఇద్దరినీ కాజల్ చుట్టేస్తున్నట్టే.