Advertisement
Google Ads BL

87 మంది సినీ జర్నలిస్ట్స్‌కు ఎఫ్.సి.ఏ సాయం


87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌

Advertisement
CJ Advs

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్ డౌన్ విధించ‌డంతో మిగ‌తా విభాగానికి చెందిన వారితో పాటుగా, సినిమా రంగానికి చెందిన సినీ పాత్రికేయులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌లేదు. ప్ర‌తీరోజు ప్రెస్ మీట్స్ లో బిజీగా ఉండే సినీ పాత్రికేయులు కూడా లాక్ డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వారికి ఆస‌రాగా నిల‌వ‌ల‌న్న‌ ఉద్దేశ్యంతో స‌భ్యులంద‌రికీ అసోసియేష‌న్ ద్వారా దాదాపు మెంబ‌ర్లు అంద‌రికీ పోన్లు చేసి ఎలాంటి తార‌త‌మ్యం లేకుండా , వ‌ద్దన్న వారిని వ‌దిలేసి 87 మందికి సోమ‌వారం నాడు ఒక్కొక్క  మెంబ‌ర్ కి ఐదువేల రూపాయ‌లు చొప్పున వారి అకౌంట్ లోకి నెప్టీ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయ‌డం జ‌రిగింది. అలాగే గ‌త వారం కొంత మంది మెంబ‌ర్స్‌కి నిత్యావ‌స‌ర వ‌స్తువులను కూడా అందించ‌డం జ‌రిగింది. 

ఈ సంద‌ర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సురేష్ కొండేటి మాట్లాడుతూ..క‌మిటీ స‌భ్యులంద‌రి స‌హాయ స‌హకారాల‌తో మ‌రియు  హెల్త్ క‌మిటీ చైర్మెన్ రెడ్డి హ‌నుమంతురావు, ముర‌ళీ స‌హ‌కారంతో  మెంబ‌ర్స్ కి సంబంధించిన‌ వివ‌రాలు సేక‌రించి 87 మంది మెంబ‌ర్స్ కి ఒక్కొక్క‌రికి ఐదు వేల రూపాయ‌లు చొప్పున పంపిచ‌గ‌లిగాం .సినిమా ఇండ‌స్ర్టీలోని 24 క్రాప్ట్స్ కి ఎప్పుడూ ముందుండి వారి గురించి ప్ర‌జ‌ల‌కు చేర‌వేసేది మా సినీ పాత్రికేయ కుటుంబ‌మేన‌ని చెబుతూ మీరు సినీ కార్మికుల సంక్షేమం కోసం చేసే మంచి ప‌నుల విష‌యంలో సినీ పాత్రికేయుల‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా కోరుకుంటున్నాను.. అని అన్నారు.

జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జ‌నార్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ..స‌మిష్టిగా అంద‌రూ క‌లిసి ప‌నిచేస్తున్నాం. క‌మిటీ స‌భ్యులంద‌రి స‌హ‌కారంతో ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి విప‌త్తు ఎప్పుడూ రాకూడ‌ద‌ని కోరుకుంటున్నాను.. అని అన్నారు. స‌భ్యుల మంచి కోసం ఎప్పుడూ మా క‌మిటీ ముందు ఉండి ప‌నిచేస్తుంద‌ని క‌మిటీ సభ్యులు పేర్కొన్నారు.  

వైస్ ప్రెసిడెంట్ సజ్జా వాసు మాట్లాడుతూ.. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి తారతమ్యం లేకుండా అందరికీ ఉండాలని కమిటీ సభ్యులు అందరూ కలిసి అనుకుని ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలాగే ట్రెజరర్ భూషణ్ మాట్లాడుతూ మన అసోసియేషన్ తరపున ముందుగా చెప్పినట్లుగా ఆదివారం సాయంత్రం వరకు వచ్చిన లిస్టు ప్రకారంగా ఈరోజు 87 మందికి 5,000 చొప్పున పంపించడం జరిగింది. మిగిలిన జర్నలిస్టులు కూడా ఎవరైనా అవసరం ఉన్నవారు అసోసియేషన్ కమిటీ సభ్యులను సంప్రదించగలరు వారికి కూడా సహకారం అందించబడుతుంది అన్నారు.

ఫిలిం థియేటర్ అసోసియేషన్ సభ్యులైన 87 మందికి ట్రాన్స్ఫర్ చేయమని రెండు చెక్కుల రూపంలో అక్షరాల నాలుగు లక్షల 35 వేల రూపాయల చెక్కులను ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ టి సీతారాములు‌గారికి  ప్రెసిడెంట్ సురేష్ కొండేటి, జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, ట్రెజరర్ భూషణ్ అందించారు.

FCA Helps Film Journalists in Tollywood:

Film Critic Association Daring Step for Journalists
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs