Advertisement
Google Ads BL

‘ఎఫ్ 3’.. పై అనిల్ చెప్పిన విషయాలివే!


ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడిని మహేష్ బాబు ఆకర్షించాడు. మహేష్‌తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసాడు. ఆ సినిమా హిట్ తర్వాత స్టార్ హీరోస్ ఎవరూ దొరక్క అనిల్ రావిపూడి దిల్ రాజు నిర్మాణంలో ఎఫ్ 3 అనౌన్స్ చేసాడు. ఎఫ్ 2 లో ఇద్దరు హీరోలు వెంకటేష్ - వరుణ్ తేజ్ లు నటిస్తే ఎఫ్ 3 లో ఆ ఇద్దరు హీరోలతో పాటుగా మరోహీరో నటిస్తాడని ప్రచారం జరగడం ఆ లిస్ట్ లోకి హీరో రవితేజ, మహేష్ పేర్లు వినబడడం జరిగింది. అయితే అటు రవితేజ కానీ ఇటు మహేష్ బాబు కానీ ఎఫ్ 3 చెయ్యడం లేదని క్లారిటీ రావడంతో.. అసలు మూడో కేరెక్టర్ ఉంటుందా అనేది అందరిలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. 

Advertisement
CJ Advs

తాజాగా అనిల్ రావిపూడి ఎఫ్ 3 లో మూడో హీరో ఉండకపోవచ్చని అంటున్నాడు. తాజాగా అనిల్ రావిపూడి ఎఫ్ 3 గురించి మట్లాడుతూ.. మూడో హీరో ని అనుకున్న మాట నిజమే అని.. కానీ ప్రస్తుతానికి ఎవరిని ఎఫ్ 3 కోసం సంప్రదించలేదని.. ప్రస్తుతానికి మూడో హీరో ముచ్చట లేదని.... ఒకవేళ యాడ్ అయితే చివరిలో యాడ్ అవుతాడని స్పష్టత లేని సమాధానం చెప్పాడు. ఇక ఎఫ్ 2 లో నటించిన హీరో వేంకటేశ్, వరుణ్ తేజ్ లతో పాటుగా తమన్నా, మెహ్రీన్ లే కనబడతారని.. ఎఫ్ 2 కామెడిలా కాకుండా మరో కొత్త కథతో ఎఫ్ 3 ఉంటుంది అని చెప్పాడు.

Anil Ravipudi Talks about F3 Movie:

No Third Hero in F3 Movie Says Anil Ravipudi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs