Advertisement
Google Ads BL

ఆయన పక్కన నటించాలంటే భయంగా ఉంది..పూజా హెగ్డే


టాలీవుడ్ బుట్టబొమ్మ బాలీవుడ్ సినిమాలతో బిజీ కానుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజకి బాలీవుడ్ లో  బడా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో ప్రభాస్ తో చేస్తున్న ఓ డియర్, అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ బ్యాచులర్ చిత్రంలో నటిస్తున్న పూజకి కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కబీ ఈద్ కబీ దివాళీ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన ఖాన్ సరసన హీరోయిన్ గా నటించనుంది.

Advertisement
CJ Advs

హృతిక్ రోషన్ తో మొహంజొదారో సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన భామకి హిందీ ఇండస్ట్రీ కొత్తేమీ కాదు. అయినా సరే ఈ సారి ఆమెకు భయంగా ఉందట. సల్మాన్ ఖాన్ వంటి హీరో పక్కన నటించాలంటే కొద్ది పాటి భయం ఉంటుందని చెబుతుంది. అంతపెద్ద హీరో పక్కన నటించే అవకాశం రావడం అంటే మనలోని టాలెంట్ మరింత మెరుగుపర్చుకునే అవకాశం లభించినట్టే అని చెప్తుంది. అందుకే నటన పరంగా సల్మాన్ ఖాన్ కి సరితూగేలా నటించాలంటే భయంగా ఉందట.

ఈ పాటికే షూటింగ్ స్టార్ట్ కావాల్సిన ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. లాక్డౌన్ పూర్తయిన వెంటనే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందట. అయితే ఇటు రెండు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న పూజ..సల్మాన్ ఖాన్ సినిమాలో నటించడానికి టైమ్ తీసుకుంటుందట.

its very difficult to compete with salman khan:

Pooja hegde got an offer in bollywood 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs