Advertisement
Google Ads BL

వకీల్‌సాబ్, క్రిష్ మూవీలపై నాగబాబు వ్యాఖ్యలివీ..


టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ దాదాపు అయిపోవాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో ఆగిపోయింది. షూటింగ్ ఆగినప్పటికీ పుకార్లు మాత్రం గట్టిగానే షికార్లు చేస్తున్నాయి. మరోవైపు పవన్ తన తదుపరి సినిమాపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకట్రెండు షాట్‌లు తీసిన క్రిష్.. సినిమాలో పాత్రధారులు, టైటిల్‌పై దృష్టి పెట్టాడట. మరీ ముఖ్యంగా ఎవర్ని ఏ పాత్ర కోసం తీసుకోవాలి..? హీరోయిన్ ఎవరు..? విలన్‌గా ఎవర్ని తీసుకోవాలని అని వెతికే పనిలో ఉన్నారట. ఈ నేపథ్యంలో ‘విరూపాక్షి’ అని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకూ నిజమో కానీ తాజాగా మాత్రం ఓ మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.

Advertisement
CJ Advs

రెండు సినిమాలపై..

పింక్’ సినిమాపై ముందు నుంచే ప‌వ‌న్ చాలా ఆస‌క్తి చూపించాడ‌ు. పింక్ రీమేక్ చేయాల‌నుంద‌ని ఒక‌ట్రెండు సార్లు నాకు చెప్పాడ‌ు. రెండు భాష‌ల‌తో పోలిస్తే క‌చ్చితంగా తెలుగులో మ‌రో 10 శాతం బెట‌ర్మెంట్ చేశారు. తెలుగులో ప‌వ‌న్ అభిమానుల కోసం కొన్ని మార్పులు అయితే చేశారు. పవన్-క్రిష్ మూవీ మొగ‌లాయిల చుట్టూ తిరిగే క‌థ. సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుంది అని నేను విన్నాను. నిజంగా ఇది చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. క్రిష్ కూడా పవన్‌కు స‌రిపోయేలా రెడీ చేస్తున్నాడ‌ు. ఈ రెండు సినిమాలు త‌ప్పకుండా ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వడం ఖాయం అని తన మనసులోని మాటలను మెగా బ్రదర్ బయటపెట్టాడు. 

ఇదిలా ఉంటే.. ఈ మధ్య సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో నాగబాబు చెప్పిన మాటలతో మెగా ఫ్యాన్స్ కాసింత సంతృప్తి చెందుతున్నారు. మరి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. ఎప్పుడు పూర్తవుద్దో.. ఇంకెప్పుడు థియేటర్లలో వచ్చుద్దో..? అని మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఏ మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందో..? రీమేక్‌తో రీఎంట్రీ ఏ మాత్రం కలిసొస్తుందో జస్ట్ వెయిట్ అండ్ సీ.

Nagababu Reacts On Pawan Vakeel Sab and Krish Movie:

Nagababu Reacts On Pawan Vakeel Sab and Krish Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs