తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకు.. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్యం డోర్ డెలివరీ విషయమై రెక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ యువ నాయకుడు మంత్రి కేటీఆర్‌ను కూడా ఆర్జీవీ ట్యాగ్ చేయగా.. కేటీఆర్ వెంటనే స్పందించారు. వర్మ రెక్వెస్ట్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు.
కేటీఆర్ ట్వీట్‌తో ఆలోచనలో పడ్డ ఆర్జీవీ
‘రాము గారు.. మీరు మాట్లాడేది హెయిర్ కటింగ్ గురించే కదా..?’ అని పంచ్‌ల వర్షం కురిపిస్తూ అదిరిపోయేలా కేటీఆర్ రిప్లయ్ ఇవ్వడంతో ఆర్జీవీకి ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కాలేదు.. దీంతో ఆలోచనలో పడ్డాడాయన. అయితే 48 గంటలు తర్వాత కానీ కేటీఆర్ ట్వీట్ ఆయన రిప్లయ్ ఇవ్వలేదు. ఓ వైపు అదీ కథ.. సరిగ్గా పంచ్ పడింది కదా అని నెటిజన్లు కొందరు చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తుండటంతో ఎట్టకేలకు వర్మ స్పందించి రిప్లయ్ ఇచ్చాడు.
కేటీఆర్ దెబ్బకు ముక్కు పగిలిందట..
‘కేటీఆర్ గారు మీరిచ్చిన ఆన్సర్ నేనెక్కడో మిస్ అయ్యాను. ఏదేమైనప్పటికీ బాక్సింగ్ గ్లౌజ్ వేసుకుని మీరిచ్చిన పంచ్‌కు నా ముక్కు పగిలింది బాబోయ్. జోకులు పక్కనబెడితే మీ గవర్నమెంట్ అద్భుతంగా పనిచేస్తోంది’ అని సింపుల్‌గానే కేటీఆర్‌కు ఆర్జీవీ రిప్లయ్ ఇచ్చాడు. కేటీఆర్, వర్మ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.
ఇంతకీ ఆర్జీవీ రెక్వెస్ట్ ఏంటి..!?
లాక్ డౌన్ క్రమంలో మందుబాబులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడో ఏమోగానీ ఆర్జీవీ రంగంలోకి దిగాడు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశాడు. ‘తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మద్యం విషయంలో రెక్వెస్ట్ చేస్తున్నాను. మందు దొరక్క జుట్టుపీక్కుంటూ.. చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు మెంటల్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇంకొందరైతే ఆ ఫ్రస్టేషన్‌తో భార్యలను కొడుతున్నారు. మీరందరూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాగే మద్యాన్ని హోం డెలివరీ చేసే మార్గం ఉదో చూడండయ్యా..’ అని సీఎం వైఎస్ జగన్, కేసీఆర్, కేటీఆర్‌లను ఆర్జీవీ ట్యాగ్ చేశాడు. అంతేకాదు.. ఈ ట్వీట్‌కు పశ్చిమబెంగాల్ సీఎం హోం డెలివరీ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వచ్చిన కథానాన్ని జోడించంతో ఆర్జీవీ హాట్ టాపిక్ అయ్యాడు. ఆ తర్వాత కేటీఆర్ పంచ్‌లేయడం.. దానికి 48 గంటలు గడిచిన తర్వాత ఆలోచించి మరీ ఆర్జీవీ పై విధంగా రిప్లయ్ ఇచ్చాడు.