Advertisement
Google Ads BL

సూపర్బ్ డీల్.. నాని టీమ్ టెంప్ట్ అవుతారా?


ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అందులో మొదటగా తెలుగులో వాయిదా పడిన సినిమా నాని - సుధీర్ బాబుల ‘వి’ సినిమా. ఇంద్రగంటి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘వి’ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కరోనా మహమ్మారి ఓ వారం ఆగివుంటే నాని అలా థియేటర్స్ లోకి వచ్చేసేవాడే. కానీ కుదరలేదు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ని తెలంగాణ ప్రభుత్వమే కాదు.. ఇండియా వైడ్ గా చాలా రాష్ట్రాలు పొడిగించడంతో సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో ఎవ్వరికి తెలియదు. అసలు విడుదలైనా థియేటర్స్ కి జనాలు రావాలంటే జంకుతారు. అందుకే ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫామ్స్ అధినేతలు సినిమా నిర్మాతలకు గాలం వేస్తూ సినిమాలను డైరెక్ట్ గా ఓటిటి ద్వారా విడుదలకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఓటిటి ప్లాట్‌ఫామ్స్ మాత్రమే ప్రేక్షకులకు పెద్ద దిక్కు.

Advertisement
CJ Advs

అందుకే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, సన్ డైరెక్ట్, హాట్ స్టార్ లాంటి ఓటిటి ప్లాట్‌ఫామ్స్ సినిమాలను విడుదల చెయ్యడానికి భారీ మొత్తాన్ని నిర్మాతలకు ఆఫర్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న రామ్ రెడ్ ని అలాగే అడగగా.. రామ్ కుదరదు మా మూవీ ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లోనే దిగుతుంది అన్నాడు. తాజాగా నాని వి సినిమా అంచనాలను క్యాష్ చేసుకునేలా అమెజాన్‌ ప్రైమ్ సంస్థ ఈ మూవీ హక్కులను భారీ లెవల్లో కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందట. నాని - సుధీర్ బాబు కాంబో మీద అమెజాన్ సంస్థ ఏకంగా 35 కోట్లు పెట్టడానికి రెడీ అయ్యింది అంటే... మాములు విషయం కాదు. మరి థియేటర్స్ లోకి రాకుండా తమ ప్లాట్‌ఫామ్స్ నుండి విడుదల చేసేందుకు నిర్మాతలతో సంప్రదింపులకు అమెజాన్ సంస్థ దిగిందట. మరి 35 కోట్లకి నాని అండ్ కో టెంప్ట్ అవుతారేమో చూడాలి.

Bumper Offer to Nani V Movie from amazon prime:

amazon prime quotes 35 cr to V Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs