అవసరాల శ్రీనివాస్ నటుడిగా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అటు నటన ఇటు డైరెక్షన్ రెండింటిని హ్యాండిల్ చేస్తున్న అవసరాల ప్రస్తుతం నాగశౌర్యతో ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు. గతంలో అవసరాల, నాగశౌర్య కాంబోలో రెండు మూవీస్ వచ్చాయి. తాజాగా నాగశౌర్యతో అవసరాల శ్రీనివాస్ చేస్తున్న సినిమా అటు ఇండియా ఇటు అమెరికా చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతుంది. అయితే ప్రస్తుతం కరోనాతో లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల వలే అవసరాల - నాగ శౌర్య మూవీ షూటింగ్ వాయిదా పడింది.
అయితే ప్రస్తుతం ఇండియాలో కొంతమేర జరుపుకున్న సినిమా షూటింగ్.. మిగతాది అమెరికాలో జరుపుకోవాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఇప్పట్లో అమెరికా వెళ్లలేని పరిస్థితి. అందులోనూ కరోనా మహమ్మారి అమెరికాని గడగడలాడిస్తోంది. దీనితో శ్రీనివాస్ అవసరాలను నిర్మాతలు కథను మార్చవయ్యా అని చెబుతున్నారట. అమెరికాలో తెరక్కించే కథను మార్చమని అవసరాలను నిర్మాతలు కోరుతున్నారట. తొందరగా కథను చేంజ్ చేసి ఇండియా పరిసరాల్లోనే షూట్ జరిగేలా చూడమని.. లేదంటే బడ్జెట్ పరంగా చాలా నష్టపోవాలని అవసరాలకు వారు సూచిస్తున్నారట.