Advertisement
Google Ads BL

హీరోయిన్ వేటలో మహాసముద్రం..


ఆర్ ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన అజయ్ భూపతి తన రెండవ చిత్రంలో నటించే హీరో కోసం ఎన్నో రోజులుగా వెతుకుతూనే ఉన్నాడు. మహాసముద్రం పేరుతో తెరకెక్కనున్నఈ సినిమాలో హీరోగా రవితేజ నటిస్తాడని వార్తలొచ్చినా..మధ్యలో ఏదో రభస జరిగి రవితేజ సినిమా నుండి తప్పుకున్నట్లు వచ్చింది. అయితే రవితేజ చేయనన్న తర్వాత అజయ్ భూపతి మరో హీరో కోసం తిరుగుతూనే ఉన్నాడు. 

Advertisement
CJ Advs

నాగచైతన్యకి కథ నచ్చి చేస్తానని మాటిచ్చాడట.. కాకపోతే ప్రస్తుతం అతని చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యేవరకు వెయిట్ చేయమని చెప్పడంతో అజయ్ మరో హీరో దరికి చేరాడు. రణరంగం, జాను వంటి వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న శర్వానంద్ మహాసముద్రంలో చేస్తానని చెప్పాడట. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరెకెక్కే ఈ సినిమా కోసం హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు.

ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫిధా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టిన సాయిపల్లవిని తీసుకోవాలని భావిస్తున్నారట. కథా పరంగా విభిన్నమైన చిత్రం కాబట్టి, సాయిపల్లవి సినిమా చేయడానికి ఒప్పుకుంటుందని అనుకుంటున్నారు. ఒకవేళ సాయిపల్లవి ఒప్పుకుంటే ఆమెకి శర్వానంద్ తో ఇది రెండవ చిత్రం అవుతుంది. పడి పడి లేచే మనసు సినిమాలో శర్వానంద్ సరసన ఆమె నటించింది.

Ajay bhupathi searching for heroine:

Rx 100 director searching for heroine 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs