Advertisement
Google Ads BL

3 గంటలు సరే జక్కన్నా.. కామెడీ సంగతేంటి!?


‘బాహుబలి’ సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా కూడా బాహుబలిని మించిపోతుందని.. భారీగానే అంచనాలున్నాయ్. అంతేకాదు ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తుండటంతో ఆ అంచనాలు కాస్త డబుల్ అయ్యాయ్. కరోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది. సినిమా షూటింగ్ ఆగినా పుకార్లు మాత్రం అస్సలు ఆగలేదు.. రోజుకో పుకారు పట్టుకొస్తోంది. తాజాగా సినిమా నిడివి, కామెడీ విషయమై మరోసారి ‘RRR’ చర్చనీయాంశమైంది.

Advertisement
CJ Advs

వాస్తవానికి జక్కన్న దాదాపు తెరకెక్కించిన సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో పాటు భారీగానే నిడివి ఉంటుంది. ఇందుకు ఉదాహరణ ‘బాహుబలి’ 01, 02 పార్ట్‌లే. ‘బాహుబలి’ రెండున్నర గంటలకి పైగానే ఉండగా.. ‘బాహుబలి 2’ మాత్రం 10 నిమిషాల తక్కువ 3 గంటల నిడివితో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. బాక్సాఫీస్‌ను షేక్ చేసి రికార్డ్స్‌ను బద్ధలు కొట్టి టాలీవుడ్ అంటే ఏంటో యావత్ ప్రపంచానికి తెలిసేలా చేశాడు జక్కన్న. అయితే..‘రౌద్రం రణం రుధిరం’ కూడా 03:00 గంటల నిడివి ఉంటుందని టాక్ నడుస్తోంది.

కథాకథనాలు, బలమైన సన్నివేశాలు, ప్రధాన పాత్రల ప్రాధాన్యత, సందర్భానికి తగిన పాటలు ఇవన్నీ కలిపితే మొత్తం 03:00 గంటల నిడివి వస్తుందట. మరీ ముఖ్యంగా టాలీవుడ్ మొదలుకుని హాలీవుడ్ వరకూ నటీనటులు ఇందులో యాక్ట్ చేస్తుండటంతో పాత్ర పరంగా ఎలాంటి ఆరోపణలు, అసంతృప్తులు రాకుండా చక్కగా తీర్చి దిద్దబోతున్నారట. అన్నీ సరే బాహుబలి రెండు పార్ట్స్‌లోని కాస్తో కూస్తో కామెడీ ఉంది.. సీరియస్‌గా నడుస్తున్నప్పుడు మరీ బోర్ అనిపించకుండా నడించింది. అయితే.. ఇప్పుడు ‘RRR’ లో కామెడీ ఉందా లేదా..? అనేది తెలియట్లేదు. ఒకవేళ లేకపోతే మాత్రం అంత సేపు ప్రేక్షకులను సీట్లో కూర్చోబెట్టాలంటే కష్టమేమో జక్కన్నా.. కాస్త ఆలోచిస్తే బెటరేమో..!.

News About RRR Run Time..! :

News About RRR Run Time..!   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs