టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్.. రేంజ్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ తర్వాత ఈయన రేంజే మారిపోయింది. దీంతో యంగ్ రెబల్ స్టార్ కాస్త స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు. ఆయన క్రేజ్ చూసిన దర్శకనిర్మాతలు ‘బాహుబలి’ అనంతరం సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తున్న చిత్రం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్). అయితే దీనికి ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్‌ను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు..? అనేదానిపై అటు టాలీవుడ్‌లో.. ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సంచలన దర్శకుడు, స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ‘కేజీఎఫ్’తో తన సత్తా ఏంటో యావత్ సినీ ఇండస్ట్రీ ప్రశాంత్ చాటి చెప్పిన విషయం విదితమే. ఈ సినిమా పార్ట్-02 కూడా రెడీ అయిపోయింది. అయితే ఈ రిలీజ్ తర్వాత టాలీవుడ్‌ను కూడా దున్నేయాలని భావించిన ఆయన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేదా సూపర్ స్టార్ మహేశ్ బాబు తోగాని సినిమా చేసే అవకాశం ఉందనే చాలా రోజులుగా టాక్ నడిచింది. అయితే వారిద్దరూ ఈ ఏడాది కాదు కదా వచ్చే ఏడాది వేసవి వరకూ ఫ్రీ అవ్వరు.
దీంతో.. వారిద్దర్నీ కాదనుకోని ప్రభాస్‌తో సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. డార్లింగ్ కోసం అదిరిపోయే స్క్రిప్ట్‌ను ఆయన రెడీ చేశాడట. అంతేకాదు.. ఈ కాంబోలో వచ్చే మూవీని నిర్మించడానికి మూవీ మేకర్స్ సిద్ధమైందట. మరోవైపు ఈ నిర్మాణ సంస్థ నుంచి ప్రశాంత్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. గతంలోనూ ప్రభాస్‌కు ప్రశాంత్ నీల్ కథ సిద్ధం చేశారని.. యు.వి.క్రియేషన్స్ సంస్థకు కథ వినిపించగా.. మేం రెడీ అంటూ లాక్ చేసేసిందనే అని టాక్ నడించింది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే మరి.