టాలీవుడ్‌లో వారసత్వంగా వచ్చిన వారు మెగా ఫ్యామిలీతో పాటు అక్కినేని, దగ్గుబాటి, ఘట్టమనేని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కుటుంబాలే ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ మెగా హీరోలపై చాలా మంది కన్ను ఉంటుంది. ఎందుకంటే వాళ్లు చాలా వరకు సక్సెస్ అవ్వడం కారణం. మరోవైపు కొందరు విమర్శకులైతే.. క్రికెట్ టీమ్ అంత మంది హీరోలు ఉన్నారనే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయ్. ఏదైతేనేం టాలెంట్‌తో అలా రాణించేస్తున్నారు.. ఇంతకి మించి చెప్పడానికేమీ లేదు. అయితే.. తాజాగా మెగా వారసులపై మీరు ఏమంటారు..? వారసత్వంపై మీ కామెంట్ ఏంటి..? అనే ప్రశ్న ఫైర్ బ్రాండ్, కలెక్షన్ కింగ్, సీనియర్ నటుడు కమ్ నిర్మాత మంచు మోహన్ బాబుకు ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. ఇందుకు స్పందించిన ఆయన చాలా లాజిక్‌గా బదులిచ్చారు.
కలెక్షన్ కింగ్ రియాక్షన్ ఇదీ..
‘నిజానికి నాకు వారసత్వం అనే పదమే ఇష్టం లేదు.. నాకు నచ్చదు. అసలు ఎవడికి కావాలి వారసత్వం..?. నా పిల్లలుగా విష్ణు, మనోజ్, లక్ష్మి ఉండాలని దేవుడు రాసిపెట్టాడు కాబట్టి వచ్చారు అంతే. దీనికి వారసత్వం.. వారసులు అని అనకూడదు. అసలు వారసత్వం అంటే ఏంటి..?. మనోజ్‌కు నటన అంటే ఇష్టం.. విష్ణుకు మాత్రం బిజినెస్‌పై మక్కువ ఎక్కువ. మంచు లక్ష్మి కూడా నటనలోనే కొనసాగాలని చూస్తోంది. వారసుల గురించి నో కామెంట్స్ అంతే. ఎవడికి ఎక్కడ రాసుంటే అక్కడికే వస్తాడు.. సక్సెస్ అవుతాడు అంతకు మించి ఏమీ లేదు’ అని తన మనసులోని మాటను మంచు మెహన్ బాబు చెప్పుకొచ్చారు.