Advertisement
Google Ads BL

ఉదయ్ కిరణ్ సూసైడ్‌పై సోదరి షాకింగ్ కామెంట్స్


టాలీవుడ్‌‌లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యువ నటుడు ఉదయ్ కిరణ్ అర్థాంతరంగా తనువు చాలించిన ఆరేళ్లు అవుతోంది. అయితే ఇప్పటికీ ఆయన ఎలా చనిపోయాడు..? ఎందుకు చనిపోయాడు..? ఆత్మహత్యకు గల కారణాలేంటి..? అవన్నీ నిజమైన కారణాలు లేకుంటే ఇంకేమైనా జరిగిందా..? అనేదానికి మాత్రం ఇంతవరకూ సమాధానాల్లేవ్. అయితే తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ సోదరి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement
CJ Advs

తమ్ముడు కోటీశ్వరుడు..

ఆర్థిక ఇబ్బందులు, సినిమా అవకాశాలు మందగించి ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలు అవాస్తవం. నా తమ్ముడు కోటీశ్వరుడు. మా అమ్మ మాకు భారీగానే ఆస్తులు ఇచ్చింది. వాడికి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లేవ్. డబ్బుల్లేక చనిపోవాల్సిన ఖర్మ మా తమ్ముడికి పట్టలేదు. సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా నా తమ్ముడు ఎప్పుడూ కోటీశ్వరుడే. వాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవు. వాళ్ల అమ్మ చనిపోతూ నాకు.. నా తమ్ముడికి 4 కేజీల బంగారంతో పాటు 100 కేజీల వెండి.. అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో మూడు ఆస్తులు కూడా ఇచ్చింది. అవన్నీ కూడా ఉదయ్ పేరు మీదే ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు నా తమ్ముడు డబ్బులేని వాడు ఎలా అవుతాడు?అని శ్రీదేవి కొత్త అనుమానాలు తెరపైకి తెచ్చింది. సోదరి వ్యాఖ్యలతో మరోసారి ఉదయ్ కిరణ్ సూసైడ్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.

విషితపైనే అనుమానాలు..

కాగా.. ఉదయ్ మరణాంతరం ఆ బంగారం, ఆస్తులు ఉదయ్ కిరణ్ భార్య విషిత తీసుకున్నట్లు కూడా శ్రీదేవి చెప్పింది. కొన్ని అనివార్య కారణాల వల్ల తండ్రికి దూరమైన ఉదయ్‌కి.. భార్యతో సఖ్యత కుదరక మానసిక క్షోభతో చనిపోయాడని పరోక్షంగా తన మనసులోని మాటను బయటపెట్టింది. తాను విషితను కలవాలని ప్రయత్నించినప్పటికీ ఆమె అస్సలు టైమ్ ఇవ్వలేదు.. ఏదో ఒక కారణం తప్పించుకుంటోందని.. మమ్మల్ని దూరం పెడుతోందని ఒకింత ఆవేదన వ్యక్తం చేసింది. విషిత ప్రవర్తనతో తమకు అనుమానాలు వస్తున్నాయని శ్రీదేవి చెప్పింది. మరి ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో..? విషిత రియాక్ట్ అవుతుందో లేదో వేచి చూడాలి.

Uday kirans sister sensational comments on his suicide:

Uday kirans sister sensational comments on his suicide  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs