Advertisement
Google Ads BL

లాక్‌డౌన్‌తో నిత్యామీనన్ ఏం చేస్తోందంటే..


నిత్యా మీనన్.. ఈ పేరు ప్రత్యేకించి మరి పరిచయం చేయనక్కర్లేదు. తెలుగులో నటించి మెప్పించి.. తన ఖాతాలో వేసుకున్న హిట్ చిత్రాలు తక్కువే అయినప్పటికి అభిమానులను మాత్రం గట్టిగానే సంపాదించుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. దీంతో బాలీవుడ్‌పై కన్నేసి ‘మిషన్ మంగళ్’లో నటించి పర్లేదు అనిపించుకుంది. అయితే అప్పుడెప్పుడో వార్తల్లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది. దీంతో మళ్లీ ఎప్పుడు తెలుగులో నటిస్తారు..? అని అభిమానులు తెగ అడిగేస్తున్నారు. అయితే ప్రస్తుతం సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఆమెకు లేనట్లు తెలుస్తోంది.

Advertisement
CJ Advs

ఎవరో రాసిన కథలో తాము నటించడమేంటి..? అది వాళ్లు ఎలా చెబితే అలా మనం నటించాలా..? అని గట్టిగా అనుకుందేమో కానీ.. తానే కథలు రాయడం మొదలెట్టేసింది. అంటే.. సినిమాలొద్దు ప్రస్తుతానికి కథలే ముద్దు అని అనుకుందన్న మాట. మొత్తానికి చూస్తే తనలో నటీమణిని బయటపెట్టిన నిత్యా.. ఇప్పుడు రైటర్‌ను కూడా బయటపెట్టడానికి తెగ తాపత్రయ పడుతోందని దీన్ని బట్టి తెలుస్తోంది. అయితే కథ కూడా ప్రస్తుతం లాక్‌డౌన్ నడుస్తుండటంతో తన చుట్టూ జరుగుతున్న విశేషాలను గమనించి.. అందులోంచి తన మనసుకు తోచిన ఒక మంచి పాయింట్‌ను పట్టుకుని రాస్తున్నానని చెప్పుకొచ్చింది. మరి ఈ కథ ఎప్పుడు పూర్తవుద్దో..? ఎవరికి సెట్ అవుద్దో జస్ట్ వెయిట్ అండ్ సీ.

కాగా.. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు సర్వం బంద్ అయ్యాయి. మరోవైపు లాక్‌డౌన్ ఇంకా పొడిగించే అవకాశాలు మెండుగానే ఉన్నాయ్. ఈ తరుణంలో నటీనటులు అంతా నాలుగు గోడలకే పరిమితం అయ్యారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో తాము ఇంట్లో కూర్చొని ఏమేం చేస్తున్నాం..? కొత్తగా చేస్తున్న పనులేంటి..? కొందరైతే టైం ఎలా వేస్ట్ చేస్తున్నామో చెబుతుంటే..? మరికొందరేమో టైమ్‌ను ఎలా వాడుకుంటున్నారో చెబుతున్నారు..? సో.. ఇలా చిత్ర విచిత్రాలుగా సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నారు.

Nithya Menen What’s doing in Lockdown:

Nithya Menen What’s doing in Lockdown  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs