Advertisement
Google Ads BL

స్టార్ హీరోయిన్‌కు యాంకర్ రష్మి కౌంటర్!


అవును మీరు వింటున్నది నిజమే.. స్టార్ హీరోయిన్ అయితే నాకేంటి..? ఇలా చేయడం సబబు కాదు కదా..? అని సోషల్ మీడియా వేదికగా ఆ భామను.. యాంకర్ రష్మి కడిగిపారేసింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరబ్బా అనుకుంటున్నారా..? ఆమేనండోయ్ బాబూ.. సోనమ్ కపూర్. ఇంతకీ వీరిద్దరి మధ్య ఏం జరిగింది..? రష్మి ఎందుకింతలా రియాక్ట్ అయ్యింది..? ఆ హీరోయిన్ ఫ్యాన్స్ ఏమంటున్నారు..? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.

Advertisement
CJ Advs

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ నడుస్తుండటంతో సెలబ్రిటీలు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. అసలు సోషల్ మీడియా అంటే ఏంటో తెలియని వారు కూడా అకౌంట్స్ ఓపెన్ చేసేసి మరీ తెగ హడావుడి చేసేస్తున్నారు. అయితే తాజాగా సోనమ్‌ కపూర్ చేసిన ట్వీట్‌కు రష్మి స్ట్రాంగ్‌గా రియాక్టయ్యి కౌంటర్ ఇచ్చింది. ‘నేను చాకోలెట్ వాల్‌నట్ కేక్ తయారు చేశాను. నా దగ్గర చాకోలెట్ నిండుకోవడంతో ‘ఫార్చ్యూన్ గౌర్మెట్ ఇండియా’ సంస్థ మంచి నాణ్యత కలిగిన చాకోలెట్‌ను నాకు పంపింది. ఈ సంస్థను నడుపోతన్న దేవికి కృతజ్ఞతలు’ అని ఇన్‌‌స్టాగ్రామ్‌లో ఫొటోతో సహా సోనమ్ పోస్ట్ చేసింది.

ఇందుకు రష్మి స్పందిస్తూ.. సోనమ్‌కు చాక్లెట్ పంపిన కంపెనీపై కన్నెర్ర జేసింది. మీరు ఇలాంటివి చేయడం గొప్ప విషయమే.. కానీ బాధ్యత కూడా ఉండాలని చెప్పుకొచ్చింది. ‘చాకోలెట్ డెలివరీ కోసం ప్రజల్ని బయట తిప్పడం ఈ సమయంలో అంత ముఖ్యమా..? మీరు చేసిన పని వల్ల తమ ఫేవరేట్ సెలబ్రిటీ చేసినట్టు తాము కూడా కేక్‌ను బేక్ చేయాలని వాటి తయారీ పదార్థాల కోసం స్టోర్లకు పరిగెడతారు.. అప్పుడు పరిస్థితేంటి..?’ అని రష్మిక ఒకింత కౌంటర్ పేల్చింది. అయితే అసలు విషయం ఏమిటంటే..  ఫార్చ్యూన్ గౌర్మెట్ ఇండియా కంపెనీ ఫుడ్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ సోనమ్ వ్యవహరిస్తోంది.. ఈ విషయం తెలియని రష్మి కౌంటర్ పేల్చడంతో.. ఆమె అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.

Anchor Reshmi Counter To Bollywood Star Actress:

Anchor Reshmi Counter To Bollywood Star Actress  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs