Advertisement
Google Ads BL

‘రెడ్’ రిలీజ్‌పై క్లారీటీ ఇచ్చిన రామ్


రామ్ హీరోగా పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్‌తో రామ్ బ్లాక్ బస్టర్ మాస్ హిట్ అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ రేంజ్ మారిపోయింది. అయినప్పటికీ భారీ బడ్జెట్ తో కాకుండా కిషోర్ తిరుమల తో రెడ్ మూవీ చేసాడు. ఇదో రీమేక్ సినిమా. అయితే రామ్ రెడ్ సినీమా షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్దమయినప్పటికీ... కరోనా కారణంగా వాయిదా పడాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం వరసలో ఉన్న సినిమాల తర్వాతే రెడ్ విడుదల డేట్ ఇవ్వాలి. కరోనా కారణంగా థియేటర్స్ తెరిచినా ఇప్పుడున్న పరిస్థితులలో సినిమా విడుదల అనేది ఇబ్బందే.

Advertisement
CJ Advs

అందుకే చాలామంది చిన్న నిర్మాతలు తమ సినిమాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తేవాలనే యోచన చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇస్మార్ట్ శంకర్ తో క్రేజ్‌లో ఉన్న రామ్ రెడ్ కి మంచి థియేట్రికల్ ధర పలికినా ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల వలన ఓటిటి ప్లాట్‌ఫామ్ వారు రెడ్ సినిమాని నేరుగా విడుదల చేసేందుకు రెడ్ నిర్మాతలకు భారీ ఆఫర్ ఇచ్చారట. దానిలో భాగంగా వెబ్ రిలీజ్‌తో పాటు శాటిలైట్ రైట్స్‌కు ఓ ప్రైవేట్ ఛానెల్ ఆసక్తి చూపినట్టు... రెడ్ నిర్మాత ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ రామ్ మాత్రం రెడ్ సినిమాని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేయడం లేదనీ.. ఎంత లేట్ అయినా థియేటర్‌లోనే విడుదల చేస్తామని చెబుతున్నాడట. ఇస్మార్ట్ కొచ్చిన క్రేజ్ రెడ్‌కి హెల్ప్ అవుతుంది అనుకుంటే.. రెడ్ సినిమాకి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. 

Ram Clarity on Red Movie Release:

Ram About Red digital release rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs