Advertisement
Google Ads BL

కేసీఆర్, జగన్‌కు వర్మ రెక్వెస్ట్.. కేటీఆర్ పంచ్!


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకు.. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిన్న రెక్వెస్ట్ పెట్టాడు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ యువనాయకుడు మంత్రి కేటీఆర్‌‌ను కూడా ఆర్జీవీ ట్యాగ్ చేశాడు. ట్విట్టర్‌లో యమా యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ వెంటనే స్పందించారు. వర్మ రెక్వెస్ట్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు. ఇంతకీ ఆర్జీవీ చేసిన రెక్వెస్ట్ ఏంటి..? కేటీఆర్ ఇచ్చిన పంచ్ ఏంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

మద్యం దొరక్క..!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆర్జీవీ తన వంతుగా అభిమానులు, సినీ ప్రియులను చైతన్య పరుస్తూ ఇదివరకెన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో సలహాలు, సూచనలు ఇస్తూ వస్తున్నాడు. అంతేకాదు స్వయంగా తన గాత్రంతో ఓ పాట కూడా పాడి అలెర్ట్ చేశాడు. అయితే.. లాక్‌డౌన్ నేపథ్యంలో అందరి ఇబ్బంది సంగతులు ఎలా ఉన్నాయో పైనున్న దేవుడికి.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికే ఎరుక కానీ.. మందుబాబుల బాధలు మాత్రం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మందు దొరక్క మద్యం ప్రియులు జుట్టు పీక్కుంటున్నారు. ఇంకొందరైతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ పిచ్చాస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇదంతా మన తెలుగు రాష్ట్రాల్లోనే.. అంటే పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటి లేవని కాదు కానీ.. ప్రస్తుతం టాపిక్ మన రాష్ట్రాలన్న మాట.

ఆర్జీవీ రెక్వెస్ట్ ఇదీ..

ఈ క్రమంలో మందుబాబులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడో ఏమోగానీ ఆర్జీవీ రంగంలోకి దిగాడు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశాడు. ‘తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మద్యం విషయంలో రెక్వెస్ట్ చేస్తున్నాను. మందు దొరక్క జుట్టుపీక్కుంటూ.. చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు మెంటల్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇంకొందరైతే ఆ ఫ్రస్టేషన్‌తో భార్యలను కొడుతున్నారు. మీరందరూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాగే మద్యాన్ని హోం డెలివరీ చేసే మార్గం ఉదో చూడండయ్యా..’ అని సీఎం వైఎస్ జగన్, కేసీఆర్, కేటీఆర్‌లను ఆర్జీవీ ట్యాగ్ చేశాడు. అంతేకాదు.. ఈ ట్వీట్‌కు పశ్చిమబెంగాల్ సీఎం హోం డెలివరీ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వచ్చిన కథానాన్ని జోడించాడు. 

కేటీఆర్ పంచ్ ఇదీ..

ట్విట్టర్ కింగ్, యువనేత మంత్రి కేటీఆర్ వెంటనే ఆర్జీవీ ట్వీట్‌కు రియాక్ట్ అయ్యి పంచ్‌ల వర్షం కురిపించారు. ‘రాము గారు.. మీరు మాట్లాడేది హెయిర్ కటింగ్ గురించే కదా..?’ అని ఒకింత పంచ్‌ల వర్షం కురిపిస్తూ అదిరిపోయేలా కేటీఆర్ రిప్లయ్ ఇచ్చారు. కేటీఆర్, వర్మ మధ్య జరిగిన ఈ సంభాషణను సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వైరల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు మందు బాబులైతే ‘అయ్యా.. ఆర్జీవీ నువ్ మా కోసం పుట్టావయ్యా..’ అని సరదాగా పొగిడేస్తున్నారు. ఇంకొందరైతే మీమ్స్‌ను తెగ పోస్ట్ చేసేస్తున్నారు.

RGV Request Telugu States CM.. KTR Punch!:

RGV Request Telugu States CM.. KTR Punch!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs