Advertisement
Google Ads BL

మహేష్ కోసం త్రివిక్రమ్ ఎన్టీఆర్‌కి హ్యాండిస్తాడా?


ఈ మధ్యన మహేష్ బాబు మళ్ళీ త్రివిక్రమ్‌కి దగ్గరవుతున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు ఎలాంటి సినిమా చెయ్యాలో అనేది క్లారిటీ లేక ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడని.. పరశురామ్ తో మహేష్ మూవీ అంటూ ప్రచారం జరిగినా మహేష్ ఇంకా స్పష్టంగా డెసిషన్ తీసుకోలేకపోతున్నాడని.. ఇప్పటికే సుకుమార్ లాంటి గ్రేట్ డైరెక్టర్ ని, వంశీ పైడిపల్లి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ని పక్కనబెట్టిన మహేష్ కి అసలు ఎలాంటి కథ కావాలో క్లారిటీ లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అందరూ పాన్ ఇండియా లెవల్ మూవీస్ కి షిఫ్ట్ అవుతుంటే మహేష్ ఇంకా సౌత్‌నే పట్టుకుని వేలాడుతున్నాడని అంటున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు, పరశురామ్ ని పక్కనబెట్టి అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ కొట్టి.. తనతో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్ ని దువ్వుతున్నాడనే టాక్ వినబడుతుంది.

Advertisement
CJ Advs

అయితే త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో కమిట్ అయ్యి అనౌన్సమెంట్ కూడా ఇప్పించాడు. కానీ మహేష్ మాత్రం త్రివిక్రమ్ కోసం నమ్రతని రంగంలోకి దింపాడనే టాక్ మొదలయ్యింది. నమ్రత, మహేష్ కి త్రివిక్రమ్ కి మధ్యలో రాయబారం మొదలెట్టింది అని.. మహేష్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చెయ్యండి. ఎన్టీఆర్ ఎలాగూ RRR మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ అయ్యేలోపు మహేష్ తో ఓ సినిమా ప్లాన్ చేయండి. అది కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ మూవీగా చెయ్యమని నమ్రత, త్రివిక్రమ్ ని అడుగుతుంది. మహేష్ కోసం ఎంత బడ్జెట్ అయినా పెడదామని.. దానికి తగ్గట్టుగా కథని రెడీ చెయ్యమని.. కామెడీ, యాక్షన్ మిళితమైన కథతోనే పాన్ ఇండియాకి వెళదామని నమ్రత, త్రివిక్రమ్ తో రాయబారం నడుపుతుంది. మరి మహేష్ తో సినిమా కోసం త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి హ్యాండ్ ఇస్తాడేమో అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే అజ్ఞాతవాసి డిజాస్టర్ అయిన టైంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కి అరవింద సమేత ఛాన్స్ ఇచ్చి ఆదుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ హ్యాండ్ ఇస్తాడా చూద్దాం అంటున్నారు.

Mahesh Babu wants Movie with Trivikram Srinivas:

Namratha Suggestions to Mahesh for His next Film 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs