Advertisement
Google Ads BL

ప్రేమ నిజమే..పెళ్ళి ఆలోచన ఇప్పట్లో లేదు..


హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల గురించి తెలియని వారుండరు. క్రీడాకారిణిగా కంటే వివాదాల ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. చేతన్ ఆనంద్ ని పెళ్ళి చేసుకుని విడాకులు తీసుకున్న జ్వాల మళ్ళీ ప్రేమలో పడింది. కొన్ని రోజులుగా ఆమె ప్రేమ గురించి వస్తున్న వార్తలపై స్పందించకుండా ఉన్న జ్వాల, సడెన్ గా ఆమె ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి షాక్ ఇచ్చింది.

Advertisement
CJ Advs

తమిళ నటుడు విష్ణు విశాల్ తో ప్రేమలో ఉన్నానని బయటకి వెల్లడించింది. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ ఉండడంతో తన ప్రియుడిని మిస్ అవుతున్నానని పోస్ట్ కూడా చేసింది. అయితే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు నిజమే.. మరి పెళ్లెప్పుడూ చేసుకుంటారని వస్తున్న వార్తలపై జ్వాల స్పందించింది. జ్వాల మాట్లాడుతూ, ప్రేమ విషయంలో మేము చాలా క్లారిటీగా ఉన్నామని, మా ఇద్దరి మధ్య గౌరవంతో కూడిన ప్రేమ ఉందని.. అందువల్ల పెళ్ళి గురించి ఇప్పట్లో ఆలోచించట్లేదని తెలిపింది. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే జ్వాల, సడెన్ గా పెళ్ళి చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు.

Love is true.but not thinking about marriage:

Gutta jwala about marriage with her  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs