రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది. కెరటం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మొదటి హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే గత కొన్ని రోజుల నుండి రకుల్ ప్రీత్ కి తెలుగులో అవకాశాలే లేవు. మన్మధుడు ౨ తర్వాత ఆమెకి తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. నాగార్జునతో నటించిన మన్మధుడు ౨ చిత్రం వల్లే తెలుగులో ఆమెకి ఛాన్సులు లేవని అంటున్నారు.
మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా వచ్చిన మన్మధుడు ౨ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. అందాల రాక్షసి సినిమాలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రకుల్ పాత్ర మరీ బోల్డ్ గా ఉండడంతో జనాలు ఆ పాత్రని అసహ్యించుకున్నారు. కొత్తదనం పేరుతో హీరోయిన్ తో సిగరెట్ తాగించడం, ఇంకా హద్దులు మీరి మరో అమ్మాయితో కిస్ పెట్టించడంతో ప్రేక్షకులు ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యారు.
అయితే ఈ సినిమా వల్లే రకుల్ కి అవకాశాలు రావట్లేదని అంటున్నారు. అదీ గాక బాలీవుడ్ లో అవకాశం రావడంతో అటెళ్ళిపోయిన రకుల్ ని సంప్రదించే నిర్మాతలే లేరు. విజయ్ దేవరకొండతో నటించాలనుందని చెప్పిన రకుల్, నితిన్ తో నటించే ఛాన్స్ ని కొట్టేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా అది. మరి ఈ సినిమాతో పూర్వ వైభవం తెచ్చుకుంటుందో లేదో చూడాలి.