జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం విదితమే. ఈ చిత్రం తర్వాత క్రిష్‌తో కూడా సినిమా చేస్తాడని తెలిసిపోయింది. అంతేకాదు.. అప్పట్లో ‘వకీల్ సాబ్’ సినిమాలో చేస్తూ కూడా క్రిష్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడని.. సిటీ బయట పెద్ద సెట్‌లు కూడా వేశారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఇదిగో స్టోరీ చారిత్రక నేపథ్యంలో ఉంటుందని నెట్టింట్లో పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా.. ఈ సినిమాకు సంబంధించి ఫుల్ డీటైల్స్ వచ్చేశాయ్.. అధికారికంగా వెలువడనప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు స్టోరీ ఇలానే ఉంటుందట.
ఇదీ కథ..!?
ఇదివరకు చారిత్రక నేపథ్యంలో సాగనున్న సినిమాలో పవన్ దొంగ పాత్రలో నటిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే.. అదే నిజమని కాకపోతే ఘరనా దొంగట. అసలు ఆయన ఘరానా దొంగగా ఎలా మారతాడు..? అనే విషయానికొస్తే.. ఓ బడా గ్యాంగ్‌స్టర్ దగ్గర పవన్ పనిచేస్తుంటాడట. అయితే ఆ గ్యాంగ్‌స్టర్ కన్ను కోహినూర్ వజ్రంపై పడుతుందట. దాన్ని దొంగలించే పనిని పవన్‌కు ఆయన అప్పజెబుతాడట. అలా పవన్ ఘరానా దొంగగా మారతాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
వాట్ నెక్స్ట్..!?
తనకూ ఓ టీమ్ తయారు చేసుకుని పవన్ అష్టకష్టాలు పడి ఎట్టకేలకు కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లి బాస్‌కు అప్పగిస్తాడట. ఆ తర్వాత జరిగే పరిణామాలు సస్పెన్స్‌గా మంచి థ్రిల్లింగ్‌గా ఉంటాయట. పోలీసుల కనిపెట్టడం పవన్‌ను అరెస్ట్ చేయడం.. ఆయన మూడో కంటికి బయటికి వచ్చేయడం.. ఆ తర్వాత మళ్లీ కోర్టు మెట్లెక్కడం ఇవన్నీ జరుగుతాయట. మొత్తానికి చూస్తే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు సినిమా మొత్తం కోహినూర్ వజ్రం చుట్టూనే తిరుగుతుందట.
పాత్రధారులు వీరేనా..?
కాగా ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించనున్నాడని సమాచారం. అంతేకాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో కీలక ప్రాతలో నటిస్తున్నట్లు తాజాగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ కూడా అయ్యింది. మరోవైపు అదిగో ఈ బ్యూటీ ఖరారైంది.. అబ్బే ఆమె కాదు ఈమే ఫైనల్ అని హీరోయిన్ విషయంలోనూ పుకార్లు గట్టిగానే వచ్చాయి. ఆఖరికి స్వీటీ అనుష్క దగ్గర వచ్చి ఆ పుకార్లు ఆగాయి. ఆమే ఫైనల్ అనే విషయం కూడా క్లారిటీ రాలేదు. అయితే సినిమాకు సంబంధించి ఇంతవరకూ అధికారిక ప్రకటన ఎలాంటిదీ బయటికి రాలేదు.