Advertisement
Google Ads BL

నందనిరెడ్డి కోసం చైతూను ఒప్పించిన సామ్!


లేడీ డైరెక్టర్ నందినిరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎక్కడో అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా మొదలైన ఆమె కెరీర్.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాకు బ్రాండ్‌గా మారిపోయింది. ఈమె కొత్తగా కథ రాసినా.. ఏదైనా సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నట్లు తెలిసినా హీరోయిన్‌లు ఆమె ఇంటి వాలిపోయే రేంజ్ ఉందిప్పుడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత నటించిన ‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి రేంజ్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమాతో సామ్-నందిని మంచి ఫ్రెండ్స్ అయ్యారు కూడా. ఓ వైపు కాంట్రోవర్షియల్ వెబ్ సిరీస్‌.. మరోవైపు సినిమా కథలతో ప్రస్తుతం ఈమె బిజిబిజీగా ఉంది.

Advertisement
CJ Advs

ఇదిలా ఉంటే.. ఇటీవలే ఒక మంచి కథ నందిని రెడీ చేసిందట. మంచి పేరున్న.. హిట్స్ పడిన కుర్ర హీరో ఈ కథకు అవసరం రావడంతో ఒకరిద్దర్ని సంప్రదించదట. అయితే సారీ మేడమ్ ఇప్పట్లో కష్టమేనని చెప్పారట. మరికొందరేమో ఫలానా టైమ్‌లో తనకు ఓకే అని.. అంతవరకు వెయిట్ చేస్తారా అని కూడా అడిగారట. దీంతో హీరోను వెతకటం నందినీ పెద్ద పనైపోయిందట. అయితే తాజాగా నందిని-సామ్ ఇద్దరూ ఫోన్ మాట్లాడుతుండగా హీరో ప్రస్తావన వచ్చిందట. ఇదీ పరిస్థితి అని సామ్‌కు ఆమె చెప్పిందట. అంతేకాదు నాగ చైతన్య అయితే కరెక్ట్‌గా సెట్ అవుతాడేమో.. ఆయన ఒప్పుకుంటాడా..? అని నందని ఒక్క మాట అనిందట. ఇందుకు స్పందించిన సామ్.. ‘నాకు వదిలేయండి మేడమ్ నేను చూస్కుంటా’ అని చెప్పిందట.

చైతూను ఒకటి రెండ్రోజులు బతిమాలిన సామ్.. ఎట్టకేలకు ఒప్పించేసిందట. వాస్తవానికి ప్రస్తుతం చైతూ బిజిబిజీగా ఉన్నాడు శేఖర్ కమ్ములతో ‘లవ్ స్టోరీ’.. ఆ తర్వాత గీతా గోవిందం దర్శకుడు పరుశురామ్‌తో సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ సామ్ తన ఫ్రెండ్‌ నందినికి మాటిచ్చానని చెప్పడంతో కొంచెం టైమ్‌ తీసుకుని చేద్దామనే ధీమాతో చైతూ ఉన్నాడట. ఇంతకీ ఆ సినిమాలో చైతూ పాత్రేంటో..? అసలు ఇది ఎంతవరకు వర్కవుట్ అవుద్దో..? ఈ తాజా పుకార్లలో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

Samantha to convince husband for Nandini Reddy!:

Samantha to convince husband for Nandini Reddy!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs