Advertisement
Google Ads BL

మళ్లీ బన్నీపై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. కారణమిదీ!


టైటిల్ చూడగానే మళ్లీ ఏం జరిగింది రా బాబూ.. అస్తమానూ ఈ గొడవలేంటి..? అనుకుంటున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. అప్పుడెప్పుడు బన్నీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే తాజాగా బన్నీ చేసిన పనికి పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు చాలా హర్ట్ అయ్యారట. ఇంతకీ హర్టయ్యేంత పని బన్నీ ఏం చేశాడు..? అసలు మళ్లీ బన్నీపై ఫైర్ ఎందుకు అవుతున్నారు..? సోషల్ మీడియా వేదికగా యుద్ధం ఎందుకు జరుగుతోంది..? అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో చూద్దాం.

Advertisement
CJ Advs

ఇదీ అసలు కథ..

ఏప్రిల్-8న టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ పుట్టిన రోజు. బన్నీతో పాటు అక్కినేని అఖిల్‌, పవన్-రేణుదేశాయ్ కుమారుడు అకీరా పుట్టిన రోజు కూడా. బన్నీకి పెద్ద ఎత్తున అభిమానులు, మెగా హీరోలు చిత్రవిచిత్రాలుగా ‘ఎత్తు’ అని సంబోదిస్తూ ఫన్నీగా విషెస్ చేశారు. కరోనా నేపథ్యంలో ఫ్యాన్స్ సైలైంట్‌గా ఉన్నారు కానీ..‌ లేకుంటే ధూమ్ ధామ్‌గా సెలబ్రేషన్స్ ఉండేవి. సింపుల్‌గానే అల్లు అర్జున్ తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకున్నాడు. మరోవైపు వారం ముందు నుంచే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు విషెస్ చేయడం మొదలుపెట్టారు.

ఇదిలా ఉండగా.. తనతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న అక్కినేని అఖిల్‌కు స్వయంగా ఫోన్ చేసిన బన్నీ.. ‘హ్యాపీ బర్త్ డే బ్రదర్’ అని విష్ చేశాడట. అయితే.. అకీరాకు మాత్రం అస్సలు ఫోన్ చేయలేదట. అంతేకాదు.. కనీసం సోషల్ మీడియా వేదికగా సింగిల్ ట్వీట్ కూడా చేయకపోవడంతో పవన్ ఫ్యాన్స్.. మెగాభిమానులు గుర్రుమంటున్నారట. సోషల్ మీడియా వేదికగా బన్నీని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. 

వాస్తవానికి.. అప్పుడెప్పుడో ప్రారంభమైన ఈ గొడవ.. 2019 ఎన్నికలకు ముందు బన్నీ స్వయంగా వెళ్లి పవన్ పార్టీ జనసేన తరఫున ప్రచారంలో పాల్గొనడంతో కాస్త వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా ‘అలవైకుంఠపురములో..’ ఫంక్షన్‌లో పవన్ ఫ్యాన్స్ కోరిక మేరకు ‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్’ అని అన్నాడు. దీంతో దాదాపు వివాదం సద్దుమణిగిందే అనుకున్నప్పటికీ అకీరా పుట్టిన రోజుతో మరోసారి బన్నీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్‌గా పరిస్థితి ఏర్పడింది. దీనిపై బన్నీ.. పవన్ కల్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Again Bunny Vs Pawan Fans.. Full Details Here..:

Again Bunny Vs Pawan Fans.. Full Details Here..  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs