పాత సినిమా పాటలని రీమిక్స్ పేరుతో కొత్త సౌండులతో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తుంటారు. అయితే చాలా వరకు ఈ రీమిక్స్ పాటలు ఒరిజినల్ సాంగ్ లోని మ్యాజిక్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవుతుంటాయి. ఎక్కడో ఒకటి, రెండు మినహా చాలా వరకు రీమిక్స్ పరిస్థితి ఇదే. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనీష్ బగ్చీనీ రీమిక్స్ పాటలకి స్పెషలిస్ట్ అని చెప్పుకుంటారు. అయితే ఆయన చేసిన రీమిక్స్ పాట కూడా బెడిసికొట్టింది. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ అప్సెట్ అయ్యాడు.
అదేంటి.. తనీష్ పాట చేస్తే రెహమాన్ అప్సెట్ కావడమేంటని అనుకుంటున్నారా..? ఎందుకు అవడు.. రీమిక్స్ చేసింది రెహమాన్ పాటనే అయినపుడు.. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూరు హీరో హీరోయిన్లుగా నటించిన ఢిల్లీ 6 సినిమాలోని మసక్కలీ.. మసక్కలీ.. అనే పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. పాటే కాదు. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. అయితే తనీష్ బగ్చీ రీమిక్స్ చేసిన పాటలో సిధ్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియా కనిపించారు. ఈ పాటతో ఒరిజినల్ సాంగ్ లోని ఇంటెన్సిటీని తీసుకురాలేకపోయారు.
పిక్చరైజేషన్ తో పాటు పాట సౌండింగ్ కూడా అంతగా లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. దాంతో అప్సెట్ అయిన ఏఆర్ రెహమాన్ ఒరిజినల్ వెర్షన్ విని ఆనందించమని ట్వీట్ చేసాడు. అంటే తనీష్ రీమిక్స్ చేసిన ఆ పాట రెహమాన్ కి నచ్చలేదని అర్థం అవుతుంది.