Advertisement
Google Ads BL

బన్నీ ‘ఆరో’ వేలు వెనుక సీక్రెట్ ఇదేనా..!?


టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ - హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించి ఏప్రిల్-08న అన్ని వివరాలు అధికారంగా వెలువడ్డాయ్. సినిమా టైటిల్, ఫస్ట్ అండ్ సెకండ్ లుక్స్ అన్నీ వచ్చేశాయి. సినిమాకు ‘పుష్ప’ అనే టైటిల్‌ ఖరారు చేయగా ముందుగా అనుకున్నట్లే ఇది ఎర్రచందనం నేపథ్యంతో సాగే కథే అని తాజాగా మరోసారి తేలిపోయింది. మరోవైపు.. తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల‌తో ఓరల్‌గా పాన్ ఇండియా చిత్రంగా ‘పుష్ప’ విడుద‌ల కాబోతోంది. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. పోస్టర్స్ చూసిన జనాలంతా చిత్రవిచిత్రాలుగా మాట్లాడేసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

మరీ ముఖ్యంగా.. పోస్టర్‌లో బన్నీ కాలుకు ఆరు వేళ్లు ఉన్నాయ్. మామూలుగా మనిషికి ఐదువేళ్లు మాత్రమే ఉంటాయ్. మరి బన్నీకి ఆరు వేళ్లు ఎందుకున్నాయ్..? అనే ఆలోచన అభిమానుల్లో.. ఇటు సినీ ప్రియుల్లో మొదలైంది. దీనిపై సోషల్ మీడియాలో మాత్రం చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ వచ్చేస్తున్నాయ్. అబ్బే అది బన్నీకి బై బర్త్ వచ్చిన వేలు అని కొందరు.. ఇంకొందరేమో ఇది నిజంగా క్రియేషన్ అని..? అలా సినిమాలో సుక్కు క్రియేట్ చేశాడంతే. ఇందులో ఇక సందేహాలెందుకని మరికొందరు చెబుతున్నారు.

మరోవైపు.. బన్నీకి నిజంగానే ఆరో వేలు ఉందని.. అలా ఉండటం నిజంగా చాలా అదృష్టమని కొందరు తమ మనసులోని మాటను చెబుతున్నారు. బన్నీ రీల్ లోనూ అనగా ఫ్యామిలీ పరంగా స్టార్.. సినిమాల పరంగానూ స్టార్ అయ్యారని దీనంతటికీ కారణం ఆ ఆరో వేలే అని అభిమానులు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఆరో వేలు ఉంటే నిజంగా చాలా అదృష్టమే.. ఇందుకు ఉదాహరణ.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు ఆరవ వేలు ఉండటం.. అలా ఉండటంతో ఆయన సూపర్ స్టార్ అయ్యారని.. ఇప్పుడు బన్నీ రేంజ్ కూడా ఎక్కడికో వెళ్తుందని ఫ్యాన్ చెప్పుకుంటున్నారు. మరోవైపు టైటిల్ లోగో బ్యాగ్రౌండ్‌లో మొత్తం అన్నీ వేలి ముద్రలే ఉండటంతో అసలేంటి సుక్కూ వేలిముద్రలు, ఆరో వేలు లెక్క అని నెటిజన్లు ఆలోచించే పనిలో పడ్డారు. అసలు ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే.. క్లోజప్‌ రిలీజ్‌ చేస్తేనో లేకుంటే ఆ తర్వాత వచ్చిన లుక్‌‌తోనే క్లారిటీ రానుంది.

This is The Secret Of Bunny 6th Finger..!:

This is The Secret Of Bunny 6th Finger..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs