Advertisement
Google Ads BL

రామ్‌చరణ్‌కి ‘రంగస్థలం’.. బన్నీకి ‘పుష్ప’


రంగస్థలం సినిమాలో రామ్ చరణ్‌ని సుకుమార్ చాలా రఫ్‌గా 1987 లో ఉండే మాదిరిగా విలేజ్ లుక్ లో చూపించాడు. రంగస్థలంలో రామ్ చరణ్ చిట్టి బాబుగా అదరగొట్టేసాడు. ఆ లుక్ కానివ్వండి, రామ్ చరణ్ పలికిన గోదారి యాస కానివ్వండి అన్నిటిలోను రామ్ చరణ్ అదరగొట్టేశాడు. చెవిటి వానిగా, రామ్ చరణ్ లుక్ అప్పట్లో హైలెట్ అయ్యింది. తాజాగా రామ్ చరణ్ లుక్ తలదన్నేలా అల్లు అర్జున్ లుక్ ని డిజైన్ చేసాడు సుకుమర్. అల్లు అర్జున్ - సుక్కు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ ని, టైటిల్ ని అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రివీల్ చేసారు.

Advertisement
CJ Advs

అసలు అల్లు అర్జున్ ‘పుష్ప’ టైటిల్ కి తగ్గట్టుగా ఏమో కానీ.. ఎర్ర చందనం స్మగ్లర్ ఊర మాస్ లుక్ లో చితక్కొట్టేసాడు. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఊర మాస్ లుక్ ఈ పుష్ప సినిమా లుక్ అని చెప్పొచ్చు. సుకుమార్ హీరోల లుక్స్ ని పర్ఫెక్ట్ గా చూపించడంలో సిద్ధహస్తుడు. ఎర్రచందనం దుంగలు, ప‌క్క‌న‌ గొడ్డ‌లితో బ‌న్నీ కూర్చున్న షాట్ లుక్‌తో అల్లు అర్జున్ పుష్ప లుక్స్ అదుర్స్. హీరో పేరు పుష్ప అని... ఇలా అల్లు అర్జున్ గుబురు గ‌డ్డంతో, ఎన‌భైల్లో క‌నిపించే హెయిర్ స్టైల్‌తో.. పుష్ప చూపుల‌తోనే చంపేస్తున్నాడు. టైటిల్ లోగోలో కొన్ని వేలి ముద్ర‌ల గురుతులు క‌నబడుతున్నాయి అంటే.. సినిమా టైటిల్ కి.. పుష్క కేరెక్టర్ కి మధ్యన ఏదో లాజిక్ తో ముడిపడిన ట్విస్ట్ ఉంటాదేమో అనిపిస్తుంది. 

మరి సుకుమర్ దర్శకత్వం మాములుగా ఉండదు. లాజిక్కులు, ట్విస్టులు అబ్బో ఇలా సుక్కు మైండ్ సెట్ సామాన్యంగా అర్ధం కాదు.. మరి పుష్ప తో అల్లు అర్జున్ - సుక్కు పాన్ ఇండియాకి అడుపెడుతున్నారు. అసలు ఎవరూ ఊహించని ట్విస్ట్.. ఏమిటంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు అందులోను సుక్కుతో కలిసి అనేది నిజంగా షాకింగ్ విషయం.

Good Response to Allu Arjun Pushpa Look:

Praises on Sukumar for Rangastaham and Pushpa Heroes Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs